టాలీవుడ్ కథానాయకుడు రామ్చరమ్ సతీమణి ఉపాసన ఔదార్యం చాటుకున్నారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా నెహ్రూ జూ పార్కును సందర్శించిన ఆమె రాణి అనే ఏనుగును ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. ఈ సంవత్సరమంతా దాని పోషణకు అయ్యే ఖర్చు భరిస్తానని ప్రకటించారు. ఈ మేరకు రూ. 5లక్షల చెక్‌ను రాణి క్యూరేటర్, ఐఎఫ్ఎస్ అధికారి క్షితిజకు అందజేశారు.
"జూపార్కులో వన్యప్రాణుల సంరక్షణ బలోపేతం చేయడంలో భాగంగా ఉపాసన కొణిదెల చేసిన కృషికి కృతజ్ఞతలు. ఆమె నిబద్ధత చాలా మందికి ప్రేరణగా నిలుస్తుంది. కరోనా సమయంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువులను దత్తత తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారని భావిస్తున్నాను."
-క్షితిజ, క్యూరేటర్, ఐఎఫ్ఎస్ అధికారి
ఉపాసన జన్మదినం సందర్భంగా ఆమెకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు రామ్‌చరణ్. ఆమె దయా గుణం గురించి ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర కామెంట్‌ను పోస్ట్ చేశాడు. "దయా గుణంతో నువ్వు చేసే ఏ పనీ వృథా కాదు. అయితే ఎంత చిన్న పనైనా సరే. నువ్వు ఇలాగే కొనసాగిస్తే.. దానికి తగ్గ ప్రతిఫలం దక్కుతూనే ఉంటుంది" అంటూ రాసుకొచ్చాడు.
ఇది చూడండి : ఉపాసన.. నీవు చేసే ఏ పనీ వృథా కాదు : చెర్రీ