నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సందడి చేశాడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ. దేశంలోనే అతిపెద్ద సినిమా తెరతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్‌ను ప్రారంభించాడు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూ. 40 కోట్లతో పిండిపాళెంలో ఈ థియేటర్‌ను నిర్మించింది.
శుక్రవారం విడుదల కానున్న 'సాహో' చిత్రంతోనే ఈ థియేటర్లో షోలు ప్రదర్శితమవుతాయి. 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన తెర, 656 సీట్ల సామర్థ్యంతో 3డీ సౌండ్ సిస్టమ్‌తో థియటర్ను రూపొందించారు. ఇలాంటివి ఆసియా ఖండంలో మరో రెండు ఉన్నాయి.
ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నాడు రామ్‌చరణ్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ తార ఆలియాభట్ తెలుగు తెరకు పరిచయం అవుతుంది.
ఇది చదవండి: బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్ చెప్పనున్న విజయ్ దేవరకొండ!