లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. దూరదర్శన్‌లో మళ్లీ ప్రసారమవుతున్న అపురూప టీవీ సీరియల్స్ తెగ చూస్తున్నారు. వీటిలో ముఖ్యమైన 'రామాయణం'కు సంబంధించిన వీక్షణలు టాప్ లేపాయి. నాలుగు ఎపిసోడ్లు కలిపి 170 మిలియన్ల మంది చూశారని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) ప్రకటించింది.
"ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేయాలని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. అందువల్ల గత శనివారం నుంచి ప్రసారం చేస్తున్నాం. అందర్ని ఆశ్చర్యపరిచేలా 'రామాయణం' ధారావాహిక రికార్డు స్థాయిలో వీక్షణలు దక్కించుకుంది. కొన్నిరోజుల్లో ఇది ఇంకా పెరిగే అవకాశముంది" -- సునీల్ లుల్లా, బార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్
గత నెల 28న ప్రారంభమైన ఈ సీరియల్.. మొదటి ఎపిసోడ్‌ను 34 మిలియన్ల మంది చూడగా, 3.4 శాతం రేటింగ్ దక్కించుకుంది. అదే రోజు సాయంత్రం 45 మిలియన్లమంది చూడగా 5.2 శాతం రేటింగ్ సొంతం చేసుకుంది. ఆదివారం ఉదయం 40 మిలియన్ల మంది, సాయంత్రం 51 మిలియన్ల మంది ఈ ధారావాహికను చూశారు.
ఇదీ చదవండి: కరోనా వల్ల రణ్‌బీర్-ఆలియా పెళ్లి ప్లాన్ మారింది!