ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఓ కొత్త నిర్మాణ సంస్థ నిర్మించనుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లో చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట.
గత ఏడాది చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని తెరకెక్కించారు సురేందర్‌రెడ్డి. త్వరలో రామ్ 'రెడ్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. నివేతా పేతురాజ్, మాళవిక శర్మలు కథానాయికులుగా నటించారు. కరోనా వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

ఇది చూడండి : 'సుశాంత్ మృతిని పబ్లిసిటీకి వాడుకుంటున్నారు'