ETV Bharat / sitara

టీజర్: బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తోనే భయపెట్టిన వర్మ - రామ్​గోపాల్ వర్మ తాజా వార్తలు

సంచలన దర్శకుడు రామ్​గోపాల్ వర్మ.. కొత్త సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. '12 ఓ క్లాక్' టైటిల్​తో తీస్తున్న ఈ చిత్రం.. డిజిటల్​ తెరపై త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్: బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తోనే భయపెట్టిన వర్మ
వర్మ 12 ఓ క్లాక్ సినిమా
author img

By

Published : Jul 3, 2020, 7:30 PM IST

కరోనా ప్రభావం నేపథ్యంలోనూ ప్రభుత్వం, షూటింగ్​లకు సడలింపులతో కూడిన అనుమతులు ఇచ్చింది. అయినా సరే పలువురు దర్శకనిర్మాతలు సెట్​కు వెళ్లేందుకు భయపడుతున్నారు. దర్శకుడు రామ్​గోపాల్ వర్మ మాత్రం వరుసగా సినిమాలు తీస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. 'ఆర్జీవీ థియేటర్' అనే ప్రత్యేక యాప్​ ద్వారా 'ఫే ఫర్ వ్యూ' విధానంలో సినీ ప్రేక్షకులకు చేరువవుతున్నారు. ఇప్పటికే 'క్లైమాక్స్', 'నగ్నం' చిత్రాలు తీసిన వర్మ.. ఇప్పుడు 12 ఓ క్లాక్(12 "o" clock)తో భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా టీజర్​ను విడుదల చేశారు.

'క్షణక్షణం' కోసం ఆర్జీవీతో కలిసి పనిచేసిన సంగీత దర్శకుడు కీరవాణి.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ డైరెక్టర్ చిత్రానికి స్వరాలు అందించారు. ఇందులో మకరంద్ దేశ్​పాండే, మిథున్ చక్రవర్తి, ఆశిష్ విద్యార్థి లాంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందు రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.