'దేవదాసు' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు రామ్. ఇలియానాకు కూడా కథానాయికగా అదే తొలి సినిమా. వైవీఎస్ చౌదరి దర్శకత్వ ప్రతిభ, రామ్ నటన, డ్యాన్స్ యువతను మెప్పించాయి. అయితే ఈ చిత్రం ముందే టాలీవుడ్‌కు పరిచయం కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అనుకున్న ప్లాన్ మారిపోయింది.
తమిళ సినిమా 'యువసేన' రీమేక్ హక్కుల్ని నిర్మాత 'స్రవంతి' రవి కిశోర్ సొంతం చేసుకున్న సమయంలో రామ్‌ను హీరోగా ఎంపిక చేద్దామని అనుకున్నారు. అదే సమయంలో వైవీఎస్ చౌదరి ఓ రోజు రవి కిశోర్ కార్యాలయానికి వచ్చినప్పుడు.. అక్కడ రామ్ నటించిన లఘు చిత్రం కనిపించిందట. అప్పటికే వైవీఎస్, కొత్త వాళ్లతో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే రామ్ కనిపించగా, 'దేవదాసు'గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో 2004లో 'యువసేన'తో రావాల్సిన రామ్.. 2006లో 'దేవదాసు'గా వచ్చారు.
ఇదీ చూడండి: రణ్‌బీర్-ఆలియా నిశ్చితార్థం రాజస్థాన్‌లో?