*మెగాహీరో రామ్‌చరణ్(Ram charan).. ఆర్ఆర్ఆర్(RRR) షూటింగ్‌కు సోమవారం నుంచి తిరిగి హాజరయ్యారు. తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో చిత్రీకరణలు పున ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 'ఆర్ఆర్ఆర్' తుదిదశ షూటింగ్ మొదలైంది. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
*'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌కు 'సేహ్జాదా' అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తారు. ఇందులో మనీషా కొయిరాలా కీలకపాత్ర పోషించనున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించనున్నారు.
*ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న నయనతార.. మలయాళ స్టార్ నివీన్ పాలీతో ఓ తమిళ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకు ముందు వీరిద్దరూ 'లవ్ యాక్షన్ డ్రామా' చిత్రంలో కలిసి నటించారు. అలానే డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో రెండు ప్రాజెక్టుల్లో నటించేందుకు నయన్ సంతకాలు చేసిందట.
*తెలుగు-కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఓ సినిమాకు 'వద్దురా సోదరా' టైటిల్ ఖరారు చేశారు. అలానే ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. రిషి, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇస్లా ఉద్దీన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి: