కరోనా ప్రభావం వల్ల సినిమా షూటింగ్‌లు ఇప్పటికే వాయిదా పడుతుండగా, కొందరు సెలబ్రిటీలు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 27న అభిమానులు తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశాడు హీరో రామ్‌చరణ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ వైరస్‌ను అరికట్టే విధానాలను ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పాలని ఫ్యాన్స్‌కు సూచించాడు. తమ వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చితే, ఈ సంవత్సరం తనకిచ్చే అతిపెద్ద బహుమతి అదేనని రాసుకొచ్చాడు.
'ఆర్ఆర్ఆర్'లో హీరోగా నటిస్తున్న చరణ్.. సహనటుడు జూ.ఎన్టీఆర్‌తో కలిసి ఓ వీడియో ద్వారా ప్రజలకు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాడు. కరోనాను అరికట్టేందుకు ఆరు సుత్రాలను అందులో ప్రస్తావించారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు. ఈ వైరస్ ప్రభావం వల్ల ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది.