ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' సర్​ప్రైజ్.. ప్రాక్టీసులో చరణ్, తారక్ - RRR teaser

'ఆర్ఆర్ఆర్' హీరోలు చరణ్, తారక్.. ప్రస్తుతం క్లైమాక్స్ క్లాసుల్లో బిజీగా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని చిత్రబృందం ట్వీట్ చేసింది. ఇది చూసిన అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు.

ram charan, jr.ntr in RRR climax practise classes
'ఆర్ఆర్ఆర్' సర్​ప్రైజ్.. ప్రాక్టీసులో చరణ్, తారక్
author img

By

Published : Feb 5, 2021, 4:33 PM IST

అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ కలిసి శత్రుమూకలను తుద ముట్టించేందుకు సాధన మొదలు పెట్టారు. అందుకు తమ శక్తియుక్తులకు పదును పెడుతున్నారు. ఏ దండును ఎలా మట్టి కరిపించాలో సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది రామరాజు, భీమ్‌లు అంటే రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ అని. ఈ స్టార్‌ హీరోలిద్దరూ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

ఇటీవలే క్లైమాక్స్‌ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమా విశేషాలను 'ఆర్ఆర్ఆర్‌ డైరీస్‌' పేరుతో నిత్యం పంచుకుంటున్నారు. శుక్రవారం ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఫొటోలను షేర్‌ చేసింది.

ram charan, jr.ntr in RRR climax practise classes
'ఆర్ఆర్ఆర్' షూటింగ్​లో చరణ్, తారక్

"ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ శక్తిమంతమైన క్లైమాక్స్‌ కోసం సాధన తరగతులు" అంటూ తారక్‌, చెర్రీ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది చిత్రబృందం. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా సినిమా విడుదల తేదీతో పాటు హీరోయిన్ ఒలీవియా మోరిస్‌ ఫస్ట్‌లుక్​ను పంచుకున్నారు.

రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్‌సన్‌, అలీ సన్‌ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 13న 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.