Mega Family Christmas: మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ సంబరాలు సందడిగా జరిగాయి. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ సహా మెగా కుటుంబ సభ్యులందరూ ఒక్క చోటుకు చేరి పండగను ఘనంగా నిర్వహించారు. ఉపాసన-చరణ్ దంపతులు ఈ వేడుకకు ఆతిథ్య మిచ్చారు.

క్రిస్మస్ వేడుకలకు హాజరైనవారిలో సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక దంపతులు, బన్నీ సతీమణి స్నేహ రెడ్డి తదితర కుటుంబ సభ్యులున్నారు. పండుగ ఏదైనా ఒక్కచోట చేరి కలిసికట్టుగా వేడుకలు చేసుకోవడం మెగా ఫ్యామిలీకి అలవాటే.

ఇటీవలే విడుదలైన 'పుష్ప' పాజిటివ్ టాక్తో దూసుకుపోవడం, 'ఆర్ఆర్ఆర్' రిలీజ్కు సిద్ధంగా ఉండటం వల్ల రెట్టింపు ఉత్సాహంతో పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు అల్లు-మెగా వారసులు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోను స్నేహ రెడ్డి షేర్ చేయగా.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: క్రిస్మస్ పార్టీ మూడ్లో అందాల భామలు!