ETV Bharat / sitara

ఆ హీరోతో నాకో ఒప్పందం ఉంది: రకుల్ - శివ కార్తికేయన్ గురించి రకుల్ ప్రీత్

ప్రస్తుతం తమిళ చిత్రం 'అయలాన్' షూటింగ్​లో పాల్గొంటోంది నటి రకుల్​ప్రీత్ సింగ్. శివ కార్తికేయన్ హీరో. అయితే ఈ షూటింగ్ సమయంలో శివతో రకుల్​కు ఓ డీల్ కుదిరిందంట. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించిందీ నటి.

Rakulpreet Sing about Shiva Karthikeyan
ఆ హీరోతో నాకో ఒప్పందం ఉంది: రకుల్
author img

By

Published : Jan 23, 2021, 8:10 AM IST

కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరోతో తనకు ఒప్పందం కుదిరిందని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపింది. తెలుగు, తమిళ, బాలీవుడ్‌లలో వరుస చిత్రీకరణలతో బిజీగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సినిమాల గురించి మాట్లాడింది. 'అయలాన్‌‌' చిత్రం గురించి స్పందిస్తూ.. ఆ సినిమా హీరో శివ కార్తికేయతో తనకు ఓ ఒప్పందం ఉందని రకుల్‌ వెల్లడించింది.

Rakulpreet Sing about Shiva Karthikeyan
శివ కార్తికేయన్​తో రకుల్

"కొవిడ్‌-19 కారణంగా గతేడాది షూట్స్‌ అన్నీ నిలిచిపోవడం వల్ల 'అయలాన్‌' చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం కోసం శివ కార్తికేయన్‌తో కలిసి నటించడాన్ని నేను బాగా ఎంజాయ్‌ చేశా. శివ.. చాలా మంచి సహనటుడు. చెన్నైలో నాకు కావాల్సిన ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పేవారు. డైలాగ్స్‌ విషయంలో నాకెంతో సాయం చేసేవారు. అలాగే ఆయన సెట్‌లో ఎంతో సరదాగా ఉంటూ జోక్స్‌ వేసేవారు. చిత్రీకరణ ప్రారంభమైన కొన్నిరోజులకు మా ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అదేమిటంటే.. సెట్‌లో ఉన్నంతసేపు ఆయన నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. అలాగే నేను ఆయనతో తమిళంలో సంభాషించాలి" అని రకుల్‌ చెప్పుకొచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.