ETV Bharat / sitara

Rakul: సమంతకు రకుల్​ ఫ్యామిలీ ఫిదా - సామ్​ నటనకు రకుల్​ ప్రీత్​ సింగ్​ ఫిదా

దర్శకద్వయం రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన 'ఫ్యామిలీ మ్యాన్‌2'ను(The Family man 2) విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ముఖ్యంగా హీరోయిన్​ సమంతను(Samantha) ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సిరీస్​ను చూసిన తన కుటుంబం సామ్​ నటనకు ఫిదా అయిపోయారని చెప్పింది నటి రకుల్​ ప్రీత్​ సింగ్(RakulPreeth Singh)​. ఆమెకు అభిమానులుగా మారిపోయారని తెలిపింది.

rakul samantha
రకుల్​,సమంత
author img

By

Published : Jun 8, 2021, 4:24 PM IST

ఇప్పుడు ఎవర్ని కదిలించినా 'ది ఫ్యామిలీ మ్యాన్2‌'(The Family man 2) మాటే వినిపిస్తోంది. సమంతపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె తొలిసారిగా నటించిన వెబ్‌సిరీస్‌ 'ఫ్యామిలీ మ్యాన్2‌' ఇటీవల విడుదలైంది. ఈ సిరీస్‌కు విశేషమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇందులో సమంత(Samantha) 'రాజీ' అనే తిరుగుబాటుదారుగా కనిపించింది. నిడివి తక్కువే అయినా.. సమంత ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నిజానికి ఒక స్టార్‌ హోదాలో ఉన్న హీరోయిన్‌ ఇలాంటి డీగ్లామర్‌ పాత్ర చేయడం సాహసమనే చెప్పాలి. సవాల్‌తో కూడుకున్న పాత్రలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే సమంత ఈ పాత్రను పోషించి అందరితో శెభాష్‌ అనిపించుకుంటోంది. ఆమె నటనకు ఎంతోమంది ముగ్దులైపోయారు. ఆమె సహనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా సమంతకు ఫిదా అయిపోయింది. అంతేకాదు.. రకుల్‌ ఫ్యామిలీ మొత్తం సామ్​కు అభిమానులుగా మారిపోయారట. ఈ విషయాన్ని రకుల్‌(RakulPreeth Singh) ట్వీట్​ చేసింది.

  • #familymanseason2 has been watched and it’s USP is terrific terrific performances by all! @BajpayeeManoj Im falling short of words to say how outstanding you were in the show ! @Samanthaprabhu2 take a bow!! U are fire girl! How brilliantly have you pulled off Raji👏👏 my family

    — Rakul Singh (@Rakulpreet) June 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఫ్యామిలీ మ్యాన్2‌ చూశాను. చాలా బాగుంది. ప్రతిఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు. మనోజ్‌బాజ్‌పాయ్‌ను పొగడాలంటే మాటలు సరిపోవడం లేదు. ఇక సమంత.. నీకు హ్యాట్సాఫ్‌. 'రాజీ' పాత్రను చాలా చక్కగా చూపించావు. మా కుటుంబంలో నాతో పాటు అందరూ నీ అభిమానులుగా మారిపోయారు. దర్శకద్వయం రాజ్‌ అండ్‌ డీకేకు ప్రత్యేక అభినందనలు"

-రకుల్​ప్రీత్​ సింగ్​, హీరోయిన్​.

రాజ్‌ అండ్‌ డీకే ఈ 'ఫ్యామిలీ మ్యాన్‌2'ను తెరకెక్కించారు. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, సమంత, షరీబ్‌ హష్మి, సాజిద్‌, మేజర్‌ సమీర్‌, దేవ దర్శిని, ఆనందసామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ అండ్‌ డీకే, సుమన్‌ కుమార్‌ కథ అందించగా.. సచిన్‌ జిగార్‌, కేతన్‌ సోదా సంగీతం సమకూర్చారు. డీ2ఆర్‌ ఫిల్మ్స్‌ పతాకంపై రాజ్‌ నిడుమోరు, కృష్ణ డీకే నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

The family man
ది ఫ్యామిలీ మ్యాన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.