హీరో గోపీచంద్‌తో ఇప్పటికే 'లౌక్యం' సినిమాలో ఆడిపాడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. మరోసారి ఈ కథానాయకుడితో రొమాన్స్ చేయనుందని సమాచారం. తేజ దర్శకత్వం వహిస్తున్న 'అలివేలుమంగ వేంకరమణ' చిత్రం కోసమే రకుల్ పేరు పరిశీలిస్తున్నారట. ఈ పాత్ర కోసం ఇంతకముందు అనుష్క, కాజల్ అగర్వాల్ పేర్లు కూడా వినిపించాయి. మరి గోపీచంద్ ఎవరితో కలిసి నటిస్తాడో చూడాలి.
తేజ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'జయం', 'నిజం' చిత్రాల్లో గోపీచంద్ ప్రతినాయకుడిగా మెప్పించాడు. ప్రస్తుతం సంపత్ నంది కలిసి 'సీటీమార్' సినిమా చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో దీని చిత్రీకరణ వాయిదా పడింది. కబడ్డీ నేపథ్య కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో గోపీచంద్, తమన్నా.. కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు.
ఇదీ చూడండి : కొవిడ్-19 రిపోర్టు బయటపెట్టిన ఆ హీరో
- " class="align-text-top noRightClick twitterSection" data="">