ETV Bharat / sitara

రకుల్ తీసుకున్న ఉత్తమ నిర్ణయం అదే! - rakul preet latest news

ఇటీవల కాలంలో శాకాహారిగా మారడమే తాను తీసుకున్న మంచి నిర్ణయమని చెప్పింది హీరోయిన్ రకుల్​ప్రీత్ సింగ్. జంతువులను పరిరక్షించడంలో భాగంగా పెటాతో చేతులు కలిపిందీ భామ.

రకుల్ తీసుకున్న ఉత్తమ నిర్ణయం అదే!
హీరోయిన్ రకుల్​ప్రీత్ సింగ్
author img

By

Published : Jun 5, 2020, 8:50 PM IST

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెటా(జంతు హక్కుల సంరక్షణ సంస్థ)తో చేతులు కలిపింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సందర్భంగా శాకాహార ఉత్పత్తుల గురించి ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. తనకు సంబంధించిన ఓ క్రేజీ ఫొటోను పోస్ట్ చేసి, నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కొన్నిరోజుల క్రితం పూర్తి శాకాహారిగా మారిన రకుల్.. తన తీసుకున్న వాటిలో ఉత్తమ నిర్ణయం ఇదేనని చెప్పుకొచ్చింది.

"ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెటాతో కలిసి జంతువులను కాపాడాలని నేను అనుకుంటున్నా. రోజురోజుకు దిగజారిపోతున్న వాతావారణ పరిస్థితులు, జంతువులను వధించడం చూసి శాకాహారి కావాలనే నిర్ణయం తీసుకున్నా. ఇలా మారిన తర్వాత ఇంతకు ముందు కంటే శరీరం చాలా తేలిగ్గా అనిపిస్తోంది" -రకుల్​ప్రీత్ సింగ్, హీరోయిన్

రకుల్ ప్రస్తుతం తమిళంలో 'అయలాన్', 'ఇండియన్ 2'లో, హిందీలో అర్జున్​ కపూర్​తో కలిసి 'ఎటాక్​'లో హీరోయిన్​గా నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.