అందంతో అనతి కాలంలోనే మంచి అవకాశాలను సంపాదించుకుని.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మెప్పించింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇంత అందంగా ఉండే రకుల్.. ఇప్పటికీ తాను సింగిల్‌గానే ఉన్నానని, ప్రేమ వ్యవహారాలేం లేవని చెబుతోంది. అందుకు కారణం తన తమ్ముడే అని అంటోంది. తన సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌తో కలసి రకుల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, ఈ విషయాన్ని వెల్లడించింది.
"నా తమ్ముడు నన్ను ఎవరితోనూ డేటింగ్ చేయనివ్వలేదు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు అబ్బాయిల పక్కన నిలబడినా అమ్మానాన్నలకు ఫిర్యాదు చేసేవాడు. ఓసారి నేను ప్లేట్‌లో మోమోలు పట్టుకుని ఓ అబ్బాయి పక్కన ఊరకే నిల్చున్నాను. అది చూసిన అమన్, నేను ఆ అబ్బాయికి మోమోలు తినిపిస్తున్నానని ఇంట్లో చెప్పేశాడు"
-రకుల్‌ప్రీత్ సింగ్, కథానాయిక
"నావల్లే తను ఇలా ఉండిపోయింది అనుకుంటున్నాను. నేను అక్క స్కూల్ జీవితాన్ని నరకప్రాయం చేశాను. అలా చేసుండాల్సింది కాదని ఇప్పుడు అనిపిస్తోంది"
-అమన్, రకుల్ తమ్ముడు
ఇదీ చూడండి : కరోనా ధాటికి వెనక్కి తగ్గిన సూపర్‌హీరోలు!