హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ జోరు మీద ఉంది. ఇప్పుడు మరో హిందీ చిత్రాన్ని ఒకే చేయనుందని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రొన్ని స్క్రూవాలా రూపొందించనున్నారు. ఈ విషయాన్ని సినీపరిశ్రమకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.
"ఇంటెన్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. దీనిని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం రకుల్, స్క్రూవాలా మధ్య చర్చలు జరిగాయి. ఇందులో నటించేందుకు రకుల్ కూడా ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే ఓకే చెప్పనున్నారు. స్క్రిప్ట్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది" అని అన్నారు.
త్వరలోనే 'మేడే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది రకుల్. దీంతోపాటే 'థ్యాంక్ గాడ్', 'సర్దార్ కా గ్రాండ్సన్', 'డాక్టర్ జీ' సినిమాల్లోనూ నటిస్తోంది.
ఇదీ చూడండి ఇదొక మరపురాని అనుభవం: రకుల్