నటి రకుల్ ప్రీత్ సింగ్ లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అందరికీ సూచనలు చేస్తోంది. తానే స్వయంగా ఓ పానీయం తయారు చేసి ఇలా చేయండంటూ నెట్టింట ఓ ఫొటో షేర్ చేసింది.
"అందరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఇలాంటి సమయాల్లో సహజంగా ఉండటమే చాలా ఉత్తమం. చిటికెడు అల్లం, మిరియాలు, పసుపు, దాల్చిన చెక్కతో లవంగాలను 500 మిల్లీ లీటర్ల నీటిలో కలపండి. దాన్ని బాగా ఉడికించండి. ఆ తర్వాత తాగండి. మీకు వీలైతే, కొంచెం తేనె కూడా జోడించి తాగండి. చాలా రుచిగా ఉంటుంది. మంచి శక్తిని కూడా ఇస్తుంది"
-రకుల్‌ప్రీత్, హీరోయిన్
ప్రస్తుతం రకుల్.. కమలహాసన్ హీరోగా వస్తున్న 'ఇండియన్ 2'లో నటిస్తోంది. హిందీలో 'థ్యాంక్ గాడ్' చిత్రం చేస్తోంది. ఇందులో అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాలు నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">