హర్రర్ కామెడీ కథాంశంతో రాబోతుంది 'రాజుగారి గది 3'. అశ్విన్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ వీక్షకులను అలరించగా.. ప్రస్తుతం వచ్చిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. రెట్టింపు హర్రర్‌తో రూపొందుతోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సినిమాలో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. 'ఉయ్యాల జంపాల'తో ఆకట్టుకున్న అవికా గోర్ హీరోయిన్. మిల్కీ బ్యూటీ తమన్నాను కథానాయికగా మొదట ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాలతో ఆమె తప్పుకుంది. ఆ తర్వాత ఈ అవకాశం అవికాను వరించింది.
అశ్విన్ బాబు ప్రధాన పాత్రలో 'రాజుగారి గది' తీశాడు ఓంకార్ . ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. సీక్వెల్‌గా వచ్చిన 'రాజుగారి గది 2'లో నాగార్జున, సమంత లాంటి పెద్ద తారాగణం ఉన్నా ఆశించిన ఫలితం దక్కలేదు.
ఇదీ చూడండి: 'అఖిల్ 4'లో అక్కినేని సరసన పూజా హెగ్డే