జయప్రకాశ్ రెడ్డి మరణవార్త విని చిత్రసీమంతా షాక్‌లో ఉందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయనను ముద్దుగా జేపీ అనే పిలిచేవాళ్లమని... గుండెపోటుతో జేపీ దూరమవ్వడం చాలా బాధాకరమన్నారు. జేపీ అంటే ఎంతో అభిమానం అని... ఆయనను ఎప్పుడు కలిసినా ప్రసాదు.. ప్రసాదు అని ఎంతో ప్రేమగా పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. స్టేజ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి... సినిమాలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు.
సీమ యాసతో కమెడియన్‌గా నవ్వించి... విలన్‌గా మెప్పించిన అద్భుతమైన నటుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఏ సినిమాలో అయినా... నిడివి చిన్నదే అయినా సరే అతని క్యారెక్టర్ ప్రేక్షకుడు గుర్తుంచుకునేలా నటించడం ఆయన గొప్పతనమని రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంచి నటుడిని తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: విలనిజం, హాస్యానికి కేరాఫ్ అడ్రస్ జయప్రకాశ్ రెడ్డి