రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ప్రభాస్ వాయిస్ ఉపయోగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో అల్లూరి, కొమరం పాత్రల్ని వెండితెరపై ఆయన మాటలతోనే పరిచయం చేయబోతున్నారట రాజమౌళి. అంతేకాదు ఈ సినిమాలో ఓ పాత్రలోనూ ప్రభాస్ కనిపించనున్నారట.
- ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్ స్థానంలో నిత్యా మేనన్ పేరు పరిశీలనలో ఉంది. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇటీవల రామ్చరణ్ షూటింగ్‌లో గాయపడడం వలన చిత్రీకరణకు కాస్త బ్రేక్ పడింది. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, అలియా భట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు