ETV Bharat / sitara

Akhanda Movie: 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్​కు దర్శకధీరుడు - రాజమౌళి

'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు (Akhanda Pre Release Event) ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు దర్శకధీరుడు రాజమౌళి. హైదరాబాద్​లోని శిల్పాకళా వేదికలో శనివారం ఈ ఈవెంట్ జరగనుంది.

'Akhanda' pre-release event
అఖండ
author img

By

Published : Nov 27, 2021, 5:49 AM IST

నందమూరి బాలకృష్ణ 'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు (Akhanda Pre Release Event) దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ స్పెషల్ గెస్ట్​గా రానున్నారని చిత్రబృందం ప్రకటించింది. దీంతో అతిరథమహారథుల నడుమ ఈ కార్యక్రమం ఘనంగా జరగనుందని అభిమానులు సంబరపడిపోతున్నారు. నవంబరు 27న హైదరాబాద్​లోని శిల్పాకళా వేదికలో ఈ ఈవెంట్ జరగనుంది.

'Akhanda' pre-release event
'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ప్రత్యేక అతిథిగా రాజమౌళి

ఇప్పటికే విడుదలైన 'అఖండ' ట్రైలర్.. అభిమానుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. డిసెంబరు 2న సినిమా థియేటర్లలోకి వస్తుంది.

ఓవైపు హీరోగా సినిమాలు చేస్తున్న బాలయ్య.. అల్లు అరవింద్ 'ఆహా' ఓటీటీలో 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' అనే టాక్ షో చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్​ను 'అఖండ' ప్రీ రిలీజ్​కు గెస్ట్​గా పిలిచినట్లు తెలుస్తోంది. దీంతో అటు 'అఖండ'తో పాటు 'పుష్ప' కూడా ప్రచారమవుతుంది!

ఇదీ చూడండి: బాలయ్య 'అద్దం' డైలాగ్.. హీరో నానికి మైండ్​బ్లాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.