ETV Bharat / sitara

ప్రభాస్​ కోసం జక్కన్న.. ఒకేరోజు ఓటీటీలో డీజే టిల్లు, సామాన్యుడు - ప్రభాస్

Radheshyam Movie: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. డార్లింగ్​ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్​' గురించిన ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. దాంతో పాటు డీజే టిల్లు, రామారావు ఆన్ సినిమాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

prabhas radheshyam movie
rajamouli
author img

By

Published : Feb 27, 2022, 5:48 PM IST

Updated : Feb 27, 2022, 10:23 PM IST

Radheshyam Movie: పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించిన రాధేశ్యామ్​ను భారీ స్థాయిలో ప్లాన్​ చేస్తున్నారు మేకర్స్​. రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్​ ఇచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​. ఇప్పటికే హిందీ వెర్షన్​కు బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ వాయిస్​ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక కన్నడలో శివరాజ్​కుమార్, మలయాళంలో పృథ్వీరాజ్​ వాయిస్​ ఓవర్​ ఇచ్చినట్లు తెలిపింది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రభాస్​ సరసన పూజాహెగ్డే నటించింది. త్వరలో ప్రమోషన్స్​ కూడా మరోసారి మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పర్యటించనున్న చిత్రబృందం సినిమాపై హైప్​ తీసుకురానుంది.

ఆహాలో డీజే టిల్లు..

dj tillu
'డీజే టిల్లు'

ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన డీజే టిల్లు సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రసారంకానుంది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమా మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో సందడి చేయనుంది. విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సిద్ధుకు జంటగా నేహాశెట్టి నటించారు. శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు సమకూర్చగా తమన్‌ నేపథ్యం సంగీతం అందించారు.

సామాన్యుడు అప్పుడే..

విశాల్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'సామాన్యుడు'. థియేటర్లలో ఫిబ్రవరి 4న విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది. 'జీ 5'లో మార్చి 4 నుంచి అలరించేందుకు సిద్ధమైంది. శరవణన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్‌ సరసన డింపుల్‌ హయాతి నటించింది. విశాల్‌ నిర్మించిన ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూర్చారు.

సోనీలివ్​కు హక్కులు..

ramarao on duty
'రామారావు ఆన్​ డ్యూటీ'

Ravi Teja Ramarao on Duty: మాస్​ మహారాజా రవితేజ​ నటిస్తున్న 'రామారావు ఆన్​ డ్యూటీ' స్ట్రీమింగ్​ రైట్స్​ను సోనీలివ్​ సొంతం చేసుకుంది. మార్చి 25న గానీ, పరిస్థితులు అనుకూలించకపోతే ఏప్రిల్ 15న గానీ సినిమా విడుదలకానుంది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందుతున్న ఈ చిత్రానికి శరత్​ మాండవ దర్శకత్వం వహిస్తుండగా.. దివ్యాంశ కౌషిక్​ హీరోయిన్​గా నటిస్తోంది. సామ్​ సీఎస్​ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'భీమ్లా' గ్రాండ్​ పార్టీ​.. విజయ్​ కొత్త సినిమా అప్డేట్​.. శ్రుతికి కరోనా

Last Updated : Feb 27, 2022, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.