తమిళంతో పాటు తెలుగులో కూడా హీరోగా తనకంటూ గుర్తింపుతో పాటు అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు సూర్య. ప్రస్తుతం కె.వి ఆనంద్ దర్శకత్వంలో 'కాప్పాన్' అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఇది వరకు వీరిద్దరి కలయికలో వచ్చిన 'వీడోక్కడే', 'బ్రదర్స్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించిగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా 'కాప్పాన్' చిత్ర తెలుగు టైటిల్‌ను దర్శకధీరుడు రాజమౌళి 27వ తేదీ గురువారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రకటించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు కె.వి ఆనంద్ తెలిపాడు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ఆర్య, సాయేషా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు.
ఇవీ చూడండి.. 'స్పైడర్‌మ్యాన్' విడుదల తేదీ ఖరారు