టాలీవుడ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన దర్శకులున్నారు. కానీ తెలుగు సినిమానే ఆ రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ డైరక్టర్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. వస్తువుకు ఐ.ఎస్.ఐ మార్క్‌లా ఈ దర్శకుడి సినిమాలకు "యాన్ ఎస్.ఎస్. రాజమౌళి ఫిల్మ్" అనే 'రాజ'ముద్ర ఉంటుంది.
ఆ రాజముద్రను వేయడానికి కారణం..!
కెరీర్ ప్రారంభంలో సినిమా కోసం తను పడిన కష్టానికి సంబంధించిన పేరు మరొకరికి వెళ్తుందనే భయం, అభద్రతాభావంతో ఇలా లోగో వేసుకోవడం మొదలుపెట్టాడట రాజమౌళి. చదువు రాని వాళ్లు ఈ ముద్ర చూసి రాజమౌళి సినిమా అని గుర్తుపడతారనే ఆశతోనే ఇది సృష్టించాడు.
"వరుస విజయాలతో ఆ అవసరం ఇప్పుడు లేకుండా పోయింది. ఆ తర్వాత అదో బ్రాండ్‌లా మారిపోవడం వల్ల కొనసాగించాల్సి వస్తోంది" అని అంటున్నాడు రాజమౌళి.
ఇవీ చూడండి.. అక్షయ్‌కుమార్ 'సూర్యవంశీ' ట్రిపుల్ ధమాకా