టాలీవుడ్లో ఫీల్‌గుడ్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈయన చిత్రాల్లో హీరోయిన్‌కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. కథానాయకలను ఆత్మాభిమానం, స్వతంత్ర భావాలున్న అమ్మాయిలుగా చూపిస్తాడు శేఖర్. 'ఆనంద్' నుంచి 'ఫిదా' వరకు హీరోని డామినేట్ చేసేలా హీరోయిన్ పాత్రలుండటం చూశాం.
నాగ చైతన్య హీరోగా సాయి పల్లవితో ఈ దర్శకుడు ఓ చిత్రం మొదలుపెట్టాడు. మరి ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రను ఎలా తీర్చీదిద్దుతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత చిత్రం 'ఫిదా'లో పుట్టిపెరిగిన పల్లె కోసం,తండ్రి కోసం ప్రేమించిన వాడిని సైతం వదులుకోవడానికి ఇష్టపడే దృఢమైన అమ్మాయిగా సాయి పల్లవిని చూపించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నాడు శేఖర్ కమ్ముల.
ఇవీ చూడండి.. అందుకే 'ఆమె'ను తొలగించారా..!