కరోనా వైరస్ లాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ గుర్తుచేశారు.
![Raghu Master completes Green India Challenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10027451_ds-1.jpg)
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శేఖర్ మాస్టర్ విసిరిన హరిత సవాల్‌ను స్వీకరించిన రఘు మాస్టర్... హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పార్క్ లో తన వంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటారు. ప్రాణవాయువు పీల్చుకునే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ ఉద్యమంలో తన గురువు రాజు సుందరం మాస్టర్, రాఘవ లారెన్స్, తన సతీమణి ప్రణవికి హరిత సవాల్ విసురుతున్నట్లు తెలిపారు.
![Raghu Master completes Green India Challenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10027451_ds-2.jpg)