ETV Bharat / sitara

దర్శకేంద్రుడు తొలిసారి పండు వాడిన చిత్రమిదే!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిత్రాలంటే ముందుగా గుర్తొచ్చేది పూలు, పండ్లు. ఆయన సినిమాల్లోని పాటల్లో లేదా ఇతర సన్నివేశాల్లో నాయిక బొడ్డుపై పండ్లు, పూలు వేయడం షరా మామూలే. అయితే ఆయన చూపించిన ఈ ఒరవడి ఏ చిత్రం నుంచి మొదలైందో తెలుసా?

Raghavendra Rao throws the first fruit on the heroine
దర్శకేంద్రుడు తొలిసారి పండు వేసిన చిత్రమిదే!
author img

By

Published : Jan 20, 2021, 7:20 AM IST

ఇటీవలే దర్శకుడిగా 45 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు రాఘవేంద్రరావు. తన తండ్రి ప్రకాశ్‌ దగ్గర దర్శకత్వ మెళకువలు నేర్చుకున్న ఆయన 'బాబు' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. రాఘవేంద్రరావు అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది పువ్వులు, పళ్లు. అవి చెట్టుకు ఉన్నప్పటికంటే హీరోయిన్ల నాభీపై పడుతూ.. తన కెమెరాకు చిక్కినప్పుడు అందంగా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదేమో. అంతగా తెరపై తనదైన ముద్ర వేశారు.

ఓ నాయిక బొడ్డుపై ద్రాక్ష పండు.. మరో భామపై యాపిల్‌ పండు.. ఇలా ప్రకృతి ప్రసాదించిన పళ్లన్నీ తన సినిమాల్లోని పాటల కోసం వినియోగించారు. నాయికలను అందంగా చూపించి వారికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. అందుకే చాలామంది భామలు ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంతకీ రాఘవేంద్రరావు పూలు, పళ్లు చూపించే ఒరవడి ఎప్పుడు, ఎలా మొదలైందో తెలుసా.

Raghavendra Rao throws the first fruit on the heroine
పండ్లు

చిరంజీవి, విజయశాంతి, సుహాసిని ప్రధానపాత్రలో ఆయన తెరకెక్కించిన చిత్రం 'మంచిదొంగ'. ఇందులో 'బెడ్‌ లైటు తగ్గించనా' అనే రొమాంటిక్‌ గీతం ప్రత్యేకంగా చిత్రీకరించాలనుకున్నారు. తొలిరేయికి సంబంధించిన పాట అది. అప్పటికే ఆయన అలాంటి పాటలెన్నో గత చిత్రాల్లో చిత్రీకరించడం వల్ల కొత్తగా చేయాలనుకున్నారు. పాటను ఎలా చిత్రీకరించాలనుకున్నారో ఊహాజనితంగా సంగీత దర్శకుడు చక్రవర్తికి చెప్పి ట్యూన్‌ చేయించారు. చిరంజీవి, విజయశాంతిల తొలిరేయి సన్నివేశం కనుక విద్యుదీపాలు చూపించాల్సిందే. అందుకే లైట్‌ ఆన్‌ చేసినపుడు ఓ బీట్‌.. ఆఫ్‌ చేసినపుడు మరో బీట్‌ వచ్చేలా రూపొందించారు. ఆ కాంతులతోపాటు తొలిసారి పళ్లు, పూలు ఈ పాట కోసమే వినియోగించారు రాఘవేంద్రరావు. అలా విజయశాంతిపై తొలిపండు పడింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: "క్రాక్'​ విజయంతో చిత్రపరిశ్రమకు ఊపొచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.