ETV Bharat / sitara

కరోనా సోకిన గర్భిణి ప్రాణం కాపాడిన లారెన్స్‌ - నిండు గర్భిణి ప్రాణం కాపాడిన రాఘవా లారెన్స్

సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే దర్శకుడు రాఘవా లారెన్స్.. మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. కరోనా సోకిన ఓ నిండు గర్భిణి ప్రాణాలను కాపాడారు. అసలు ఏం జరిగిందంటే?

Raghava Lawrence's timely response helps a Coronavirus-infected pregnant woman deliver healthy baby
కరోనా సోకిన గర్భిణి ప్రాణం కాపాడిన లారెన్స్‌
author img

By

Published : May 3, 2020, 8:30 AM IST

Updated : May 3, 2020, 9:01 AM IST

ప్రముఖ నృత్య, సినీ దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్‌ సరైన సమయానికి స్పందించి, నిండు గర్భిణి ప్రాణాలు కాపాడారు. తన సాయం కోరిన కుటుంబానికి అండగా నిలిచి, మంచి మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెెలిపారు.

"ఈ శుభవార్త మీతో పంచుకోవాలి. రెండు రోజుల క్రితం నాకు తెలిసిన ఓ మహిళకు కరోనా వైరస్‌ సోకిందని తెలిసింది. ఆమె నిండు గర్భిణి, డెలివరీ స్టేజ్‌లో ఉన్నారు. ఆమె భర్త, మామ నాకు ఫోన్‌ చేసి సాయం అడిగారు. దీంతో ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ పీఏ రవి సర్‌ను సంప్రదించా. ఆయన వెంటనే స్పందించి.. గర్భిణిని కేఎమ్‌సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు కరోనా వైరస్‌ ఉందని తెలుసుకున్న వైద్యులు అన్నీ జాగ్రత్తలు తీసుకుని.. ఆపరేషన్‌ చేశారు. ఆమెకు మగశిశువు జన్మించింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. కరోనాను జయిస్తానని ఆమె నాకు మాటిచ్చింది. ఈ విషయంలో సాయం చేసిన ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు. వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీరంతా దేవుళ్లతో సమానం"

- లారెన్స్, ప్రముఖ నటుడు

ఇప్పటికే అనేక సందర్భాల్లో లారెన్స్‌ తన ఉదారత చాటుకున్నారు. పేదలకు సాయం చేస్తూనే ఉన్నారు. లారెన్స్‌ ప్రస్తుతం 'లక్ష్మీబాంబ్‌', 'చంద్రముఖి 2' పనుల్లో బిజీగా ఉన్నాడు. 'కాంచన' సినిమాకు హిందీ రీమేక్‌గా 'లక్ష్మీబాంబ్‌' తెరకెక్కుతోంది. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడు. కియారా అడ్వాణీ కథానాయిక.

Last Updated : May 3, 2020, 9:01 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.