సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. రజనీ 170వ చిత్రానికి ఇతడే దర్శకత్వం వహించనున్నాడనే వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
రజనీకాంత్‌కు లారెన్స్ ఇప్పటికే కథను వినిపించాడని, త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా 'లక్ష్మీబాంబ్' తీస్తున్నాడీ డైరెక్టర్.
ప్రస్తుతం రజనీకాంత్, శివ దర్శకత్వంలో 'అన్నాత్త'లో నటిస్తున్నాడు. నయనతార, కీర్తి సురేశ్, మీనా, ఖుష్బు కథానాయికలుగా కనిపించనున్నారు. కొవిడ్-19 కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని ఏడాది చివరలో ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.