ETV Bharat / sitara

కొంచెం ఉంటే కళ్లు తిరిగి పడిపోయేదాన్ని: నటి రాధిక - అంగ్రేజీ మీడియం సినిమాకు అమితాబ్​ ప్రశంస

'అంగ్రేజీ మీడియం'లో నటనకుగాను రాధిక మదన్​పై ప్రశంసలు కురిపించారు బిగ్​బీ అమితాబ్. ఆయన పంపిన లెటర్, బొకేకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేసిందీ భామ.

Radhika receives handwritten congratulatory note from Big B for her performance in Angrezi Medium
'కొంచెం ఉంటే కళ్లు తిరిగి పడిపోయేదాన్ని'
author img

By

Published : Mar 15, 2020, 11:46 AM IST

బాలీవుడ్​ నటి రాధిక మదన్​ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతుంది. ఇటీవలే విడుదలైన 'అంగ్రేజీ మీడియం'లో ఆమె నటనకుగానూ అమితాబ్ ప్రశంసలు కురిపించడమే ఇందుకు కారణం. స్వయంగా రాసిన లేఖతో పాటు బొకేను బిగ్​బీ పంపారంటూ ఇన్​స్టాలో రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

"అమితాబ్​ దగ్గర నుంచి ప్రశంస లభించటం నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాకు దక్కిన ఈ గౌరవానికి మాటలు రావటం లేదు. ప్రతి సినిమా విడుదల తర్వాత ఇలాంటి దానికోసం ఎదురుచూశాను. కానీ, ఈ రోజు నాకోసం అమితాబ్​.. పువ్వులతో పాటు ఒక లెటర్​ను పంపించారు అని తెలియగానే ఆనందంలో మునిగిపోయాను. కొంచెం ఉంటే కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. కల నిజం చేసిందుకు ధన్యవాదాలు అమితాబ్​ సార్​"

-రాధిక మదన్, హీరోయిన్

ఈ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇతడి కూతురిగా కనిపించింది రాధిక.​ కరోనా ప్రభావంతో ఓవైపు ఇబ్బందులు ఎదురవుతున్నా తొలిరోజు రూ.4.03 కోట్ల వసూళ్లు సాధించిందీ చిత్రం.

ఇదీ చూడండి.. కరీనా కపూర్​కు ఇష్టమైన ఆమిర్​ఖాన్ తలగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.