ETV Bharat / sitara

ఫ్యాన్స్​ చేతుల మీదుగా 'రాధేశ్యామ్​' ట్రైలర్​ లాంచ్​ - పూజా హెగ్డే

Radhe Shyam Trailer: డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రాధేశ్యామ్'​ ట్రైలర్​ను ఫ్యాన్స్​ చేతుల మీదుగా విడుదల చేయాలని నిర్ణయించింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​. ఈ నెల 23న జరగనున్న ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు అభిమానులనే అతిథులుగా పిలిచిన మేకర్స్​.. వారిచేత ట్రైలర్​ లాంచ్​ చేయించనున్నారు.

Radhe Shyam Trailer
రాధేశ్యామ్​
author img

By

Published : Dec 18, 2021, 1:51 PM IST

Radhe Shyam Trailer: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్ర ట్రైలర్​ను అభిమానులే విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందం వెల్లడించింది. ఈ నెల 23న హైదరాబాద్​లోని రామోజీఫిల్మ్ సిటీ వేదికగా చిత్ర ప్రీ రిలీజ్​ ఈవెంట్​ జరగనుంది. దీనికి అభిమానులే ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​ శుక్రవారం పేర్కొంది. అయితే ట్రైలర్​ కూడా ఫ్యాన్స్​ చేతుల మీదుగానే విడుదల చేస్తామని శనివారం ప్రకటించింది.

Radhe Shyam Trailer
ఫ్యాన్స్​ చేతుల మీదుగా 'రాధేశ్యామ్​' ట్రైలర్​

'రాధేశ్యామ్​' ప్రీ రిలీజ్ ఈవెంట్​ను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్​కు యావద్దేశం నుంచి ప్రాతినిధ్యం ఉంటుందని యూవీ క్రియేషన్స్​ పేర్కొంది. ఈ తరహా కార్యక్రమం దేశంలోనే తొలిసారి అని చెప్పింది.

Radhe Shyam Trailer
ప్రభాస్, పూజా

తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభాస్ అభిమానులు ఈ వేడుకలకు రానున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు కచ్చితంగా పాటించాలని చిత్రబృందం సూచించింది. ఇదే వేదికపై 5 భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాలం) రాధేశ్యామ్ ట్రైలర్​ను విడుదల చేయనున్నారు.

Radhe Shyam Trailer
'రాధేశ్యామ్​' పూజా హెగ్డే

ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు 'రాధేశ్యామ్'పై ఆసక్తి రేకెత్తిస్తుండగా ట్రైలర్, సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. వచ్చే ఏడాది జనవరి 14న 'రాధేశ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్​'లో చాలా సర్​ప్రైజ్​లు: డైరెక్టర్ రాధాకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.