ETV Bharat / sitara

'రాధేశ్యామ్' నుంచి మరో సాంగ్.. వెంకీ కొత్త లుక్ - ప్రభాస్ అప్​కమింగ్ సినిమాస్

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రాధేశ్యామ్, రానా నాయుడు, శాకిని డాకిని, గుర్తుందా శీతాకాలం చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

prabhas venkatesh
ప్రభాస్ వెంకటేశ్
author img

By

Published : Dec 13, 2021, 7:07 PM IST

Radhe shyam song: 'రాధేశ్యామ్' నుంచి మరో అప్డేట్​ వచ్చేసింది. 'సంచారి' అంటూ సాగే పాట టీజర్​ను మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. మంచులో స్కేటింగ్​ బోర్డ్​పై ఉన్న ప్రభాస్​ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు.

radhe shyam song
ప్రభాస్ రాధేశ్యామ్ కొత్త సాంగ్

1970ల నాటి యూరప్​ నేపథ్య కథతో 'రాధేశ్యామ్' తెరకెక్కించారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా చేసింది. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్ర పోషించారు. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Gurthunda seethakalam movie: సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. కన్నడ హిట్​ 'లవ్ మాక్​టైల్' రీమేక్​గా దీనిని తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు.

Gurthunda seethakalam movie release date
గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ పోస్టర్

Venkatesh birthday: విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'రానా నాయుడు' వెబ్​ సిరీస్​ కొత్త లుక్​ విడుదల చేశారు. ఇందులో నెరిసిన జుత్తుతో కనిపిస్తున్న వెంకీ.. అంచనాల్ని పెంచేస్తున్నారు. ఈ సిరీస్​ రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తుండటం విశేషం.

venakatesh rana naidu web series
రానా నాయుడు వెబ్ సిరీస్​లో వెంకటేశ్

ఇటీవల ఓటీటీలో 'దృశ్యం 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేశ్.. ప్రస్తుతం 'ఎఫ్3' సినిమాలో నటిస్తున్నారు. ఇది ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. 'ఎఫ్2' చిత్రానికి కొనసాగింపుగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

*హీరోయిన్ రెజీనా పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమా 'శాకిని డాకిని' ఫస్ట్​లుక్​ విడుదల చేశారు. ఇందులో నివేదా థామస్​తో ఉన్న ఆమె స్టిల్​ ఆకట్టుకుంటుంది.

Saakini dakini movie first look
శాకిని డాకిని మూవీ ఫస్ట్​లుక్

'మిడ్​నైట్ రన్నర్స్' అనే కొరియన్ సినిమాకు ఇది రీమేక్​. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు.

ఈ సినిమా పోస్టర్​పై నెట్​ఫ్లిక్స్ అని ఉంది. అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారా? తొలుత థియేటర్లలోకి తీసుకొస్తారా అనేది చూడాలి?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.