Prabhas radhe shyam: డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నాళ్లో నుంచి ఎదురుచూస్తున్న సినిమా 'రాధేశ్యామ్'. మరికొన్ని రోజుల్లో అంటే మార్చి 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌కు సిద్ధమవుతుంది చిత్రబృందం. హీరోహీరోయిన్ ప్రభాస్, పూజా హెగ్డే.. దేశంలో పలు నగరాలు చుట్టేసి, పలు ఈవెంట్స్‌లో పాల్గొని సందడి చేయనున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో హైదరాబాద్, చెన్నై, కొచి, బెంగళూరుతోపాటు హిందీ ప్రేక్షకుల్ని కవర్ చేసేందుకు ముంబయిలో 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూలు, నేషనల్ మీడియాతో ప్రెస్మీట్లతో హైప్ పెంచనున్నట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సినిమా హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించనున్నారు. తెలుగులో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కానీ దానిని చిత్రబృందం ధ్రువీకరించాల్సి ఉంది.
1970ల యూరప్ నేపథ్యంగా ఈ సినిమా తీశారు. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, విక్రమాదిత్య అనే పామిస్ట్‌గా.. పూజాహెగ్డే, ప్రేరణ అనే డాక్టర్‌గా నటించారు. జస్టిన్ ప్రభాకరన్ దక్షిణాదిలో పాటలు అందించగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. రాధాకృష్ణ కుమర్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- 'రాధేశ్యామ్' రొమాంటిక్ ట్రీట్.. విజువల్ వండర్‌గా 'ఈ రాతలే..'
- వచ్చే మూడు నెలలు సినిమాలే సినిమాలు.. లిస్ట్ ఇదే
- 'రాధేశ్యామ్'.. నన్ను డిఫరెంట్ మూడ్‌లోకి తీసుకెళ్లింది: తమన్
- 'రాధేశ్యామ్' శాటిలైట్ హక్కులు రూ.250 కోట్లకు?
- టాలీవుడ్ రేంజ్ పెరిగింది.. ప్రపంచం మన 'సినిమా' చూస్తోంది!
- 'రాధేశ్యామ్' సినిమా గ్రాఫిక్స్.. 12 దేశాల్లో వర్క్
- 'రాధేశ్యామ్' రిలీజ్.. నాలుగేళ్ల క్రితమే చెప్పిన ఆ జ్యోతిషుడు
- 'రాధేశ్యామ్'లో లవ్‌స్టోరీకి మించిన ట్విస్టులు: ప్రభాస్