ETV Bharat / sitara

'రాధేశ్యామ్​' స్పెషల్​ ట్రీట్​.. 'మేజర్'​ సందీప్​గా మెప్పించిన శేష్​! - పునీత్​ రాజ్​కుమార్​

Radhe Shyam Prabhas: కొత్త సినిమా అప్డేట్లు వచ్చేశాయి. డార్లింగ్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్', అడివి శేష్ 'మేజర్'​ సహా పలు చిత్రాల ఆసక్తికర విశేషాలు ఇందులో ఉన్నాయి.

Radhe Shyam Prabhas
adivi sesh major
author img

By

Published : Mar 15, 2022, 8:08 PM IST

Radhe Shyam Prabhas: డార్లింగ్ ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ నుంచి హృద్యమైన మ్యూజిక్ వీడియోను రిలీజ్​ చేసింది చిత్రబృందం. 'ది సోల్​ ఆఫ్​ రాధేశ్యామ్​'గా వచ్చిన వీడియోలోని సంగీతం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించగా, తమన్ బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ ఇచ్చారు. మార్చి 11 విడుదలైన ఈ చిత్రం మంచి టాక్​తో విజవంతంగా ప్రదర్శితమవుతోంది.

మహేశ్ చేతుల మీదుగా ట్రైలర్​..

చాలాకాలం తర్వాత తాప్సీ నటించిన తెలుగు చిత్రం 'మిషన్‌ ఇంపాజిబుల్‌'. 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్‌. ఆర్‌. ఎస్‌. జె. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేశారు.

ఏప్రిల్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విభిన్న కథా చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళీ నటుడు హరీశ్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు సంగీతం మార్క్‌ కె. రాబిన్‌ అందించారు.

ఆసక్తికరంగా 'రన్​వే 34' ట్రైలర్​..

బాలీవుడ్‌లో మరో ఆసక్తికర చిత్రం ప్రేక్షకులను అలరించడానికి రానుంది. అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ చిత్రమే 'రన్‌వే 34'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలో కనిపించనుంది. అజయ్‌ దేవగణ్‌ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 2015లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

విమానయాన రంగం చుట్టూ తిరిగే ఈ కథలో అజయ్‌, రకుల్‌ పైలట్లుగా, అమితాబ్‌ విచారణాధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈద్‌ సందర్భంగా ఏప్రిల్‌ 29న విడుదల చేయనున్నారు.

శేష్​.. అచ్చం మేజర్​ సందీప్​లా..

అడివి శేష్ ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మించిన చిత్రం'మేజర్'. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 27న దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. ముంబయి ఉగ్ర దాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉన్ని కృష్ణన్ 45వ జయంతిని పురస్కరించుకొని చిత్ర బృందం నివాళులర్పిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

మేజర్ జీవితంలోని వివిధ దశలను అడివి శేష్​పై చిత్రీకరించిన సన్నివేశాలను వివరిస్తూ రూపొందించిన వీడియో... ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

స్టైలిష్​గా నాగ్..

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో కింగ్​ నాగార్జున నటిస్తున్న యాక్షన్‌ చిత్రం.. 'ది ఘోస్ట్‌'. సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్​గా నటిస్తోంది. ప్రస్తుతం దుబాయ్​లో యాక్షన్​ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా.. అందుకు సంబంధించిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.

THE GHOST
నాగార్జున

ఈ చిత్రంలో నాగ్​ చాలా స్టైలిష్​గా కనబడుతున్నారు. ఈ సినిమాను నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ కలిసి నిర్మిస్తున్నారు.

THE GHOST
యాక్షన్​ సీన్​లో నాగ్

పునీత్​ కోసం మెగాస్టార్​

దివంగత కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ కోసం 'జేమ్స్​' సినిమా చూస్తానని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. "డియర్​ అప్పూ (పునీత్​).. ఈ సమయంలో నీవు మాతో లేకపోవడం ఎంతో బాధ కలిగిస్తోంది" అంటూ భావోద్వేగం చెందారు చిరంజీవి. మార్చి 17న సినిమా రిలీజ్​ కానుందని, అది సూపర్​ హిట్​ అవుతుందనే నమ్మకం ఉందని ఇటీవలే ఓ వీడియోలో చెప్పారు.

chiranjeevi
చిరు సందేశం

పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇందులో ఓ ఆర్మీ అధికారిగా కనిపిస్తారు. శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా నటించారు. శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, ప్రియా ఆనంద్‌, శరత్‌కుమార్‌, ముఖేష్‌ రుషి తదితరులు ఈ చిత్రంలో నటించారు.

ఇదీ చూడండి: RRR in 3D: 3డీలో 'ఆర్​ఆర్​ఆర్'​.. ప్రేక్షకులకు రాజమౌళి సర్​ప్రైజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.