ETV Bharat / sitara

'రాధేశ్యామ్​' ఓటీటీ రిలీజ్​కు కళ్లు చెదిరే ఆఫర్!​ - ప్రభాస్​ రాధేశ్యామ్​ సినిమా ఓటీటీ రిలీజ్​

RadheShyam OTT release: ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ డిజిటల్​ రిలీజ్​ కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్​ను ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే చిత్రబృందం మాత్రం థియేటర్లలో సినిమా విడుదల చేసేందుకే మొగ్గు చూపుతోందట.

రాధేశ్యామ్​ ఓటీటీ రిలీజ్​, Radheshyam ott release
రాధేశ్యామ్​ ఓటీటీ రిలీజ్​
author img

By

Published : Jan 4, 2022, 10:20 AM IST

RadheShyam OTT release: ప్రభాస్​, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్​'. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంపవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే కరోనా కారణంగా సంక్రాంతి బరిలో ఉన్న పలు బడా చిత్రాలు వాయిదా పడుతుండగా.. 'రాధేశ్యామ్'​ రిలీజ్​పై సందిగ్ధత నెలకొంది.

ఈ క్రమంలో ఇప్పుడీ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను నేరుగా డిజిటల్​​ రిలీజ్ చేయడం​ కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్​ను ప్రకటించిందట! ఏకంగా రూ.300కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని ఇటీవలే చిత్రబృందం స్పష్టం చేసింది. ఇక ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు, సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1970ల నాటి లవ్​స్టోరీతో ఈ మూవీని రూపొందించారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేసింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ చూస్తుంటే వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్​పై అభిమానుల్ని మెస్మరైజ్ చేయనుందనే విషయం స్పష్టమవుతోంది.

ఈ సినిమాలో రెబల్​స్టార్ కృష్ణంరాజు.. పరమహంస అనే కీలకపాత్ర పోషించారు. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇదీ చూడండి: ఇది లవ్​లెటర్స్​ టైమ్.. 'రాధేశ్యామ్​' రిలీజ్​పై డైరెక్టర్​ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.