ETV Bharat / sitara

'అలాంటి మహిళల పరిస్థితి ఏంటి?'

author img

By

Published : Mar 13, 2021, 2:57 PM IST

మీటూ ఆరోపణలు చేసినందుకు తనను కోలీవుడ్ పరిశ్రమ నిషేధించిందని అన్నారు గాయని చిన్మయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అర్థం చేసుకుని వెన్నంటే ఉండే రాహుల్ లాంటి భర్త దొరకడం తన అదృష్టమని వెల్లడించారు.

Chinmayi
చిన్మయి

"మీటూ’ ఆరోపణలు చేసినందుకు కోలీవుడ్‌ ఇండస్ట్రీ తనని నిషేధించిందని ప్రముఖ గాయని చిన్మయి అన్నారు. అయితే, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా సరే అర్థం చేసుకుని వెన్నంటే ఉండే రాహుల్‌ లాంటి భర్త దొరకడం తన అదృష్టమని ఆమె తెలిపారు. తన పాటలు, మాటలతో దక్షిణాది పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించారు. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించారు.

"మీటూ’ ఉద్యమం వేదికగా వేధింపులకు గురిచేసిన వాళ్ల పేర్లను బయట పెట్టినందుకు 2018 అక్టోబర్‌ నుంచి రాధారవి, వైరముత్తు.. కోలీవుడ్‌ పరిశ్రమలో నన్ను బ్యాన్‌ చేశారు. రాధారవి నాయకత్వంలోని డబ్బింగ్ యూనియన్ నన్ను నిషేధించింది. నేను దీనిపై చట్టబద్ధంగా పోరాడుతున్నా. వేధించిన వాళ్ల పేరు బయటపెట్టడం నేరం కాదు. పలు ఆరోపణలు ఉన్నప్పటికీ వైరముత్తు, రాధారవి సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు అనుభవిస్తున్నారు. దేవుడి దయ వల్ల తెలుగు, హిందీ, ఇతర ఇండస్ట్రీల్లో గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పని‌ చేస్తూ జీవిస్తున్నా. నన్ను అర్థం చేసుకునే మంచి భర్త, కుటుంబం ఉండడం నా అదృష్టం. మరి, అండగా నిలిచే కుటుంబం లేని మహిళల పరిస్థితి ఏమిటి?"

-చిన్మయి, గాయని

ప్రముఖ సింగర్‌ కార్తిక్‌, వైరముత్తులు తనని మానసిక వేధింపులకు గురి చేశారని 2018లో చిన్మయి చేసిన ఆరోపణలు అందర్నీ షాక్‌కు గురి చేశాయి. 'మీటూ'’లో భాగంగా సోషల్‌మీడియా వేదికగా ఆమె చేసిన ట్వీట్లు అప్పట్లో సంచలనంగా మారాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.