ETV Bharat / sitara

రాశీఖన్నా డిజిటల్ ఎంట్రీ.. సైకో హంతకురాలిగా! - రాశీఖన్నాస, అజయ్ దేవగణ్

ముద్దుగుమ్మ రాశీఖన్నా డిజిటల్ మాధ్యమంలో మెరిసేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్​లో తెరకెక్కుతోన్న క్రైమ్ థ్రిల్లర్​ సిరీస్​ 'రుద్ర:ది ఎడ్జ్ ఆఫ్ డార్క్​నెస్'​లో కీలకపాత్ర పోషించనుంది. అజయ్ దేవగణ్​ ఇందులో హీరోగా కనిపించనున్నారు.

Raashikhanna
రాశీఖన్నా
author img

By

Published : Jun 10, 2021, 6:36 PM IST

బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ 'రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌'. రాజేష్‌ మపుస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌, బీబీసీ స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కీలక పాత్రలో నటించనుంది. ఇప్పటికే ఎన్నో పోలీసు పాత్రల్ని పోషించిన అజయ్‌ ఈ వెబ్‌ సిరీస్‌లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు.

క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సిరీస్ జులై 21 సెట్స్ పైకి వెళ్లనుంది. ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో రెండునెలల పాటు చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. ఇందులో రాశి తెలివిగల సైకో హంతకురాలిగా కనిపించనుందట. రాశి నటిస్తున్న తొలి డిజిటల్‌ సిరీస్ కూడా ఇదే కానుంది. ఈ సిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికగా విడుదలకానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఇది బ్రిటీష్‌ వెబ్‌ సిరీస్‌గా వచ్చిన 'లూథర్‌' ఆధారంగా తెరకెక్కుతోంది.

ఇవీ చూడండి: గ్లామరస్​ ఫొటోలతో అదరగొడుతున్న రాశీఖన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.