ప్రేమకథా చిత్రాల్లో నటిస్తూనే, గ్లామరస్ పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుంది రాశీఖన్నా. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉన్న ఈమె.. ఈ మధ్య కాలంలో వర్క్‌వుట్స్ చేసి నాజుగ్గా తయారైంది. అయితే ఎప్పుడూ హద్దులు దాటి నటించని రాశీ.. ఫిబ్రవరిలో వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్'లో మాత్రం కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో కనిపించి, ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అవి చేసినందుకు చింతిస్తోంది. ఈ విషయమై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
"నేను 'వరల్డ్ ఫేమస్ లవర్'లో బోల్డ్‌గా నటించి తప్పుచేశా. దీని గురించి నా తల్లిదండ్రులకు ముందే చెప్పినప్పుడు, వారు ఇబ్బందిపడ్డారు. నటిస్తున్నప్పుడూ ఈ సన్నివేశాల అవసరమా అని అనిపించింది. నన్ను ఇలాంటి సీన్స్‌లో చూడటం అభిమానులకు ఇష్టం లేదని ఆ తర్వాత రియలైజ్ అయ్యా. గ్లామరస్ పాత్రల వరకు సరేగాని, భవిష్యత్తులో మాత్రం పరిధి దాటకూడదని ఫిక్సయ్యా" -రాశీఖన్నా, కథానాయిక
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రాశీ.. ఆ తర్వాత సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, శ్రీనివాస కల్యాణం, వెంకీమామ, ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో 'సైతాన్ క బచ్చా'లో కథానాయికగా చేస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">