సత్యదేవ్, ఈషారెబ్బా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'రాగల 24 గంటల్లో'. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. బుధవారం టీజర్ విడుదల చేశారు. సంభాషణలకు చోటు లేకుండా కేవలం కథనాన్ని మాత్రమే ఇందులో చూపించారు. నటీనటుల హావభావాలు.. సినిమాలో ఏం జరిగిందనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.
పోలీస్ అధికారిగా శ్రీరామ్ కనిపించనున్నాడు. రఘు కుంచె సంగీతమందిస్తున్నాడు. శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాస్ కానూర్ నిర్మాత. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: 'అన్నగారు నన్ను కొట్టారు.. భోజనం పెట్టారు': వేణుమాధవ్