ETV Bharat / sitara

'పూరీ జగన్నాథ్​ ఆఫర్​ను అందుకే వద్దన్నా!' - ఈటీవీ చెప్పాలని ఉంది ఆర్​.నారాయణ మూర్తి

జనానికి ఆయనొక సినిమా హీరో.. నిజానికి ఆయనో రైతుబిడ్డ. ఆయన మాట మాట్లాడితే అదొక విప్లవం. కానీ, ఆయన జీవన విధానం అతి సామాన్యం. ఆడంబరత అధికంగా కనిపించే సినిమా రంగంలో ఉంటూనే.. నిరాడంబరానికి ఆయన నిదర్శనంగా మారారు. ఆయన ఓ ఆదర్శ మూర్తి. ఆయన పేరు శ్రీ ఆర్​.నారాయణ మూర్తి(R. Narayana Murthy). ఈటీవీలో ప్రసారమవుతున్న 'చెప్పాలని ఉంది'(Cheppalani Vundi Etv) కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి.. ఆయన వ్యక్తిగత, సినీ విశేషాలను చెప్పారు.

R Narayana Murthy interview in Cheppalani Undi talk show
'పూరీ జగన్నాథ్​ ఆఫర్​ను అందుకే కాద్దన్నా!'
author img

By

Published : Jul 11, 2021, 12:23 PM IST

'నేరము శిక్ష' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి.. 'నీడ' చిత్రంతో హీరోగా ఎదిగి, ఆ తర్వాత 'చీమల దండు', 'ఎర్రసైన్యం' వంటి ఎన్నో సూపర్​హిట్​ సినిమాలకు నిర్మాతగా, రచయతగా, దర్శకుడిగానే కాక సినీ ఇండస్ట్రీకి ఆయన ఒక మార్గదర్శకులు అయ్యారు. 'సెల్యూలాయిడ్​ లాల్​ జెండా'గా పేరొందిన ఆర్​. నారాయణ మూర్తి(R. Narayana Murthy).. ఈటీవీలో ప్రసారమవుతున్న 'చెప్పాలనిఉంది' కార్యక్రమానికి(Cheppalani Vundi Etv) ఈ వారం ముఖ్యఅతిథిగా విచ్చేసి, తన సినీ ప్రయాణంతో సహా వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు.

సినిమా ఓ పవర్​ఫుల్​ మీడియా

నటనపై ఉన్న ఆసక్తితోనే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టినట్లు ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్​.నారాయణ మూర్తి అన్నారు. సినిమా అనేది పవర్​ఫుల్​ మీడియా అని.. ప్రపంచాన్నే మార్చే శక్తి సినిమాలకు ఉన్నట్లు ఓ మహానుభావుడు చెప్పారని తెలిపారు. కళాశాలలో చదివే రోజుల నుంచే అటు అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ.. ఇటు సినిమాలపై ఆసక్తిని కొనసాగించినట్లు నారాయణ మూర్తి చెప్పారు. పొలిటికల్​ సైన్స్​లో డిగ్రీ చేసినా.. సినిమాల్లో హీరోగా చేయాలనే ఆసక్తితో చెన్నైకి వెళ్లినట్లు వెల్లడించారు. అలా నటనతో పాటు ఉద్యమ భావాలను వెండితెరపై ప్రస్పుటించేలా సినిమాలను రూపొందించినట్లు నారాయణ మూర్తి పేర్కొన్నారు.

అభిమాన హీరోహీరోయిన్లు..

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి తన అభిమాన నటీనటులని అన్నారు ఆర్​.నారాయణ మూర్తి. వీరితో పాటు ఎన్టీఆర్​, రేలంగి, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం ఉన్న సినిమాలను అసలు చూడకుండా ఉండలేనని తెలిపారు. ఎస్వీ రంగారావు తెలుగు పరిశ్రమలో కాకుండా మరే ఇతర చిత్రసీమలో పుట్టినా.. ఆయనకు ఇదే గౌరవం లభించేదని, అంతటి మహనీయుడు ఎస్వీ రంగారావు అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

మీ దర్శకత్వంలో మరో హీరోతో ఎందుకు సినిమా రూపొందించలేదు? దానికేమైనా ప్రత్యేక కారణముందా?

సినిమాల్లో హీరోగా నటించాలని.. నా నటనకు ప్రేక్షకులు అలరించాలనేది నా కోరిక. ఆ విధంగా ప్రజలు నన్ను హీరోగా, దర్శకుడిగా, రచయితగా ఆదరిస్తున్న క్రమంలో నేను మరో నటుడితో ఎందుకు సినిమా తీయాలి?

ప్రేక్షకులు మిమ్మల్ని తెరపై చూడడమంటే ఇష్టమని చెప్పినవారు.. ఇతర దర్శకులు రూపొందించిన చిత్రాల్లో నటించకపోవడానికి కారణం?

30 ఏళ్ల నా సినీ ప్రస్థానంలో.. తొలి 20 ఏళ్లలో నా సినిమాలు చాలా బాగా ఆడాయి. కానీ, 16 ఏళ్ల నుంచి నాకు సరైన సక్సెస్​ లేదు. డి.రామానాయుడు, దిల్​రాజు, పూరీ జగన్నాథ్​ అనేక మంది మహానుభావులు నటించమని లేదా దర్శకత్వం చేయమని నాకు గొప్ప అవకాశాలు ఇచ్చారు. ఎందుకు చేయలేదంటే నేను మైనస్​లో ఉన్నాను. సినిమా అనేది బిజినెస్​గా మారిన క్రమంలో.. ప్రస్తుతం నా సినిమాలు ప్రేక్షకుల చూసే పరిస్థితి లేదు. నా సినిమాలకు ఆదరణ పెరగాలంటే నేను మళ్లీ హిట్​ కొట్టాలి. అంతవరకు నా మైనస్​ ఇతరులతో షేర్​ చేసుకొవడానికి నేను సిద్ధంగా లేను.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. ఈ దిగ్గజ దర్శకుడి ఒక్కో సినిమా.. ఒక్కో అద్భుతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.