ETV Bharat / sitara

ఏపీలో థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తుంది: ఆర్.నారాయణమూర్తి - హీరో నాని థియేటర్ ఇష్యూ

AP theatres issue: ఏపీలో థియేటర్ల మూతపడుతుండటంపై దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి భావోద్వేగంతో మాట్లాడారు. సినీ పరిశ్రమను కాపాడుకోవాలని కోరారు.

r narayana murthy
ఆర్. నారాయణమూర్తి
author img

By

Published : Dec 27, 2021, 5:26 PM IST

Updated : Dec 27, 2021, 8:45 PM IST

Theatre closed: ఆంధ్రప్రదేశ్​లో థియేటర్లు మూస్తుంటే ఏడుపొస్తుందని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని అన్నారు. హైదరాబాద్​లో సోమవారం నిర్వహించిన 'శ్యామ్ సింగరాయ్' సక్సెస్​మీట్​లో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్.నారాయణమూర్తి

యజమానులారా.. థియేటర్లు మూసేయొద్దు అని నారాయణమూర్తి కోరారు. ఈ విషయంలో తెలుగు నిర్మాతల మండలి, 'మా' జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను కాపాడుకోవాలని ప్రాధేయపడ్డారు. పండగ వేళ సినీ పరిశ్రమకు గడ్డు పరిస్థితి రావొద్దని అన్నారు.

యజమానులు.. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవాలని నారాయణమూర్తి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులపై సినీ పరిశ్రమ పెద్దలు దృష్టిపెట్టాలని కోరారు.

ఇదే ఈవెంట్​లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్​రాజు కూడా నాని కామెంట్స్​పై స్పందించారు. హీరో నాని వ్యాఖ్యలను వక్రీకరించడం తప్పని అన్నారు. థియేటర్ల గురించి నాని భావోద్వేగంతో మాట్లాడారని.. అతడిని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని స్పష్టం చేశారు.

shyam singha roy movie
శ్యామ్​సింగరాయ్ మూవీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 27, 2021, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.