ETV Bharat / sitara

ఫ్యాన్స్ అంచనాలను పెంచేలా 'పుష్ప' ట్రైలర్​ టీజ్​ - పుష్ప హిందీ సినిమా

Pushpa Trailer Tease: అల్లు అర్జున్-సుకుమార్​ కాంబినేషన్​లో వస్తున్న 'పుష్ప'పై భారీ అంచనాలే ఉన్నాయి. ట్రైలర్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు ట్రైలర్​ టీజ్​ను రిలీజ్​ చేసి అంచనాలను పెంచేసింది చిత్రబృందం.

pushpa trailer tease
పుష్ప ట్రైలర్​ టీజ్
author img

By

Published : Dec 3, 2021, 7:20 PM IST

Updated : Dec 3, 2021, 7:55 PM IST

Pushpa Trailer Tease: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ కథానాయకుడిగా సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం మొదటి భాగం 'పుష్ప ది రైజ్​'కు సంబంధించి ఈనెల 6న ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం శుక్రవారం ట్రైలర్​ టీజ్​ను విడుదల చేసింది.

26 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్​ టీజ్​.. ట్రైలర్​పై అభిమానుల అంచనాలను మరింత పెంచేలా ఉంది. ఈ చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రలను చూపించేలా ఈ ట్రైలర్​ టీజ్​ను కట్​ చేసింది చిత్ర బృందం. ఇందులోని నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది.

మైత్రీ మూవీస్​ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్​ స్వరాలు సమకూరుస్తున్నారు. అల్లుఅర్జున్​ సరసన రష్మిక నటించగా.. ఫాహద్​ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హిందీలో రిలీజ్​ ఫిక్స్​

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'పుష్ప' చిత్రానికి సంబంధించి హిందీ అప్డేట్స్​ లేకపోవడం వల్ల.. అసలు ఈ చిత్రం బాలీవుడ్​లో విడుదల అవుతుందా? అనే సందేహం అభిమానుల్లో ఉండేది. అయితే మూవీటీమ్​ దీనిపై శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. ఈనెల 6న మిగతా భాషలతో పాటే హిందీ ట్రైలర్​ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 17న 'పుష్ప' థియేటర్లలో విడుదల కానుంది.

Pushpa Trailer Tease
'పుష్ప' లేటెస్ట్​ పోస్టర్
Pushpa Trailer Tease
'పుష్ప' లేటెస్ట్​ పోస్టర్

ఇదీ చూడండి : యూట్యూబ్​లో ఈ ఏడాది ఎక్కువమంది చూసిన వీడియో ఇదే!

Last Updated : Dec 3, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.