ETV Bharat / sitara

Pushpa Movie Director: ఎర్రచందన నేపథ్యం.. 'పుష్ప' శక్తిమంతం - పుష్ప కలెక్షన్

Pushpa Movie Director: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సందడి అస్సలు తగ్గట్లేదు. థియేటర్​ల్లో, సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు దర్శకుడు సుకుమార్.

sukumar
సుకుమార్
author img

By

Published : Dec 19, 2021, 6:54 AM IST

Pushpa Movie Director: "అందరూ నేనేదో ప్రతి సినిమానీ విభిన్నంగా తీస్తుంటానని అనుకుంటుంటారు. కానీ, నాకలాంటి ఆలోచనలేం ఉండవు. నేను తీసే సీన్‌ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుందా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తుంటా" అన్నారు దర్శకుడు సుకుమార్‌. 'రంగస్థలం' వంటి హిట్‌ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా 'పుష్ప'. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. రష్మిక నాయిక. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సుకుమార్‌. ఆ విశేషాలు..

'పుష్ప'కు దక్కుతున్న ఆదరణ ఎలా అనిపిస్తోంది?

"చాలా బాగుంది. ప్రేక్షకులు ప్రతిసీన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. చక్కటి వసూళ్లు వస్తున్నాయి. నైజాంలో తొలిరోజే రూ.10కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిందని నిర్మాతలు చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. హిందీలో మేము సరైన ప్రచారం చేయకున్నా.. తొలిరోజు రూ.4కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 'స్పైడర్‌మెన్‌'లాంటి హాలీవుడ్‌ సినిమాతో పోటీ పడుతూ ఇలాంటి వసూళ్లు దక్కించుకోవడం మామూలు విషయం కాదు. హిందీలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్‌ వల్లే ఇదంతా సాధ్యమైంది".

విడుదల విషయంలో బాగా హడావిడి పడాల్సివచ్చినట్లుంది కదా?

"పుష్ప'ని డిసెంబర్‌ 17నే తీసుకురావాలని మేమంతా ముందే నిర్ణయించుకున్నాం. ఒకవేళ కుదరదంటే ఫిబ్రవరిలో లేదా వేసవిలో రిలీజ్‌ పెట్టుకుందామని నిర్మాతలు నాకు చెప్పారు. ఇప్పుడున్న కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అప్పటి వరకు వేచి చూడటం సరికాదనిపించింది. మళ్లీ మునుపటి పరిస్థితులే ఎదురైతే నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుంది. అందుకే చేతిలో తక్కువ సమయం ఉన్నా.. త్వరితగతిన నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేశాం".

ఇంతకీ ఈ చిత్ర కథాలోచనకు బీజం ఎక్కడ పడింది?

"బన్నీని పుష్పలాంటి శక్తిమంతమైన పాత్రలో చూపించాలన్న కోరిక నాకు 'ఆర్య' సినిమా చేస్తున్నప్పటి నుంచే ఉండేది. ఈ విషయాన్ని ఆయనకు అప్పట్లోనే చెప్పా. అయితే అలాంటి శక్తిమంతమైన పాత్రను చూపించాలంటే అందుకు తగ్గ కథా నేపథ్యం కావాలి. దానికి ఎర్ర చందనం బ్యాక్‌డ్రాప్‌ అయితేనే సరిగ్గా సరిపోతుందనిపించింది. నిజానికి ఈ కథను వెబ్‌సిరీస్‌గా చేద్దామనుకున్నా. స్క్రిప్ట్‌ ఆసక్తి కరంగా ఉండటంతో సినిమాగానే చేయాలని నిర్ణయించుకున్నా. ఆరేళ్ల పాటు రీసెర్చ్‌ చేసి ఈ కథ సిద్ధం చేసుకున్నా. వీరప్పన్‌తో పాటు అనేక స్మగ్లర్ల గురించి చదివి తెలుసుకున్నా. సినిమాలో ఎర్రచందనం లోడును లారీ సహా బావిలో పడేసే సీన్‌ ఉంది కదా.. అది నిజంగా జరిగినదే. సినిమాని అల్లు అర్జున్‌ తన భుజాలపై మోశాడు. పుష్పరాజ్‌ పాత్రలో ఆయనెంతో చక్కగా ఒదిగిపోయారు".

Sukumar Interview:

చాలా మంది ఈ సినిమాని ‘కేజీఎఫ్‌’తో పోలుస్తున్నారు. దీని గురించి మీరేమంటారు?

"కేజీఎఫ్‌'కు.. 'పుష్ప'కు పోలిక పెట్టడం సరికాదు. దేని ప్రత్యేకత దానిదే. మా దర్శకుడు బుచ్చిబాబు చెప్పినప్పుడే దీనిపై మాట్లాడా. 'కేజీఎఫ్‌' బ్యాక్‌డ్రాప్‌ వేరు. 'పుష్ప' అలా కాదు. ఇదొక ఎమోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. కమర్షియల్‌ ఫార్మాట్‌లో నేచురల్‌గా తీసిన సినిమా ఇది. దీన్ని మరే చిత్రంతోనో పోల్చలేం".

ఇలాంటి బరువైన కథలు చేస్తున్నప్పుడు మీకేమైనా ఒత్తిడిగా అనిపిస్తుందా?

"మీరు నమ్మరు ప్రతి సినిమా తర్వాత నన్నొక శ్మశాన వైరాగ్యం ఆవహిస్తుంది. ఇక సినిమాలు చేయను బాబోయ్‌.. నా జీవితం అయిపోయిందిక అనిపిస్తుంది. ఇప్పుడూ నేను అలాంటి స్థితిలోనే ఉన్నా (నవ్వుతూ). ఎందుకంటే దర్శకత్వం అన్నది ఓ ఎమోషనల్‌ జర్నీ. ఓ భావోద్వేగభరితమైన సన్నివేశం తెరకెక్కిస్తున్నామంటే.. ముందు ఆ ఫీల్‌ను నేను అనుభూతి చెందాలి. లేదంటే దాన్ని అనుకున్నట్లుగా తీయలేం. 'పుష్ప' విషయానికొస్తే.. దీన్నంతా మేము అడవుల్లోనే చిత్రీకరించాం. అక్కడ సరైన వసతులుండవు. ప్రతిరోజు రెండున్నర గంటలకు పైగా అడవిలో జర్నీ చేయాల్సి వచ్చేది. అక్కడి వెళ్లాక అన్నీ సెట్‌ చేసుకోవాలి. ఎక్కడ ఏ పురుగు ఉంటుందో..ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఓ నాలుగైదు గంటలు షూట్‌ చేయగానే రాత్రి అయిపోయేది. మళ్లీ తిరిగొచ్చి.. తిని పడుకునే సరికి రాత్రి పది దాటిపోయేది. మళ్లీ ఉదయం లేవగానే ఉరుకులు పరుగులు. అందుకే ఈ సినిమా నాకు చాలా సవాల్‌గా అనిపించింది. ప్రతిరోజూ షూట్‌ చేశాక.. ఇక రేపట్నుంచి వద్దు ఈ సినిమా అనిపించేది (నవ్వుతూ)".

సమంతని ఇప్పటి వరకు ఎవరూ ప్రత్యేక గీతంలో చూపించలేదు. మీరడగగానే ఆమె ఒప్పుకొన్నారా?

"లేదు. ఈ పాట గురించి చెప్పగానే నాకు కరెక్ట్‌ కాదండి అని చెప్పింది. కానీ, ఇది మీకు సరిపోతుంది.. నటిగా మీకూ కొత్తగా ఉంటుందని చెప్పా. ఇప్పుడు చాలా మంది అగ్ర నాయికలు ప్రత్యేక గీతాల్లో చేస్తున్నారు. 'రంగస్థలం'లో పూజా హెగ్డే చేసింది. మీరు ప్రయత్నించొచ్చు కదా అని అడిగా. అప్పటికీ సామ్‌ వద్దనే చెప్పింది. తర్వాత నా మాటపై నమ్మకంతో ఓకే చెప్పింది. ఇప్పుడా పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది".

ఇంతకీ ‘పుష్ప 2’ ఎలా ఉండనుంది? ఎప్పుడు మొదలవుతుంది?

"ప్రథమార్ధంలో మేము 'పుష్ప' ప్రపంచాన్ని పరిచయం చేశాం. పుష్పరాజ్‌ బాల్యం.. తండ్రితో అనుబంధం.. తన సోదరులకు ఎలా దగ్గరయ్యాడు? ప్రతినాయకులను ఎలా ఎదుర్కొంటాడు? అనే విషయాలను రెండో భాగంలో చూపించనున్నాం. ఇందులో ఒకటి రెండు పాత్రలు కొత్తవి రావొచ్చు. ఈ సినిమాతో నేను మంచి సందేశమే చెప్పనున్నా. అదేంటన్నది తెరపైనే చూడాలి. పూర్తి స్క్రిప్ట్‌ ఇప్పటికే సిద్ధమైంది. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. దసరాకి లేదా మళ్లీ డిసెంబర్‌ 17కు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం".

ఈ కథను బన్నీ కన్నా ముందు మహేష్‌బాబుకు చెప్పినట్లున్నారు కదా..?

"మహేష్‌కు కథ చెప్పిన మాట వాస్తవమే కానీ.. అదీ ఇదీ ఒకటి కాదు. నేపథ్యాలు కాస్త దగ్గరగా ఉండి ఉండొచ్చు అంతే. రెండూ వేటికవే భిన్నమైనవి".

'ఆర్య 3' ఆలోచన ఉంది. కానీ!

"నేను 'ఆర్య 3' అనే సినిమా తీస్తానేమో గానీ ఆ పేరైతే పెట్టను. ఎందుకంటే గతంలో 'ఆర్య 2' టైటిల్‌ పెట్టడం వల్ల ఆ చిత్రానికి చాలా మైనస్‌ అయింది. 'పుష్ప 2' పూర్తయిన వెంటనే విజయ్‌ దేవరకొండ సినిమా ప్రారంభిస్తా. మరికొన్ని కథలు సిద్ధం చేసుకున్నా".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"పుష్ప' ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.70కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఇది ఇండస్ట్రీ రికార్డ్‌. నైజాంలో రూ.11.5కోట్లు, ఆంధ్రాలో రూ.15కోట్లు వసూళ్లు దక్కించుకుంది. తమిళ, కన్నడ, హిందీ వెర్షన్లు మంచి కలెక్షన్స్‌ రాబట్టాయి. మాకింతటి ఘన విజయం అందించినందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు అన్ని చోట్ల సక్సెస్‌ వేడుకలు నిర్వహిస్తాం".

- మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు నవీన్‌ ఏర్నేని, రవిశంకర్‌, చెర్రీ

ఇదీ చదవండి:

'పుష్ప' ఫస్ట్ డే కలెక్షన్.. ఈ ఏడాది సరికొత్త రికార్డు

Rajasingh fire on DSP: 'పుష్ప'ను వీడని వివాదాలు.. డీఎస్పీపై రాజాసింగ్​ ఫైర్​.. ఎందుకంటే..?

మిలియన్ డాలర్​ క్లబ్​లో 'పుష్ప'.. పార్ట్​-2 షూటింగ్ అప్పుడే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.