ETV Bharat / sitara

టాప్-100 గ్లోబల్​ సాంగ్స్​లో 'పుష్ప'.. తగ్గేదే లే - top 100 pushpa songs

Pushpa songs record: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా మరో రికార్డును సాధించింది. ఈ మూవీలోని అన్ని పాటలు యూట్యూబ్​ విడుదల చేసిన టాప్-100 గ్లోబల్​ సాంగ్స్​ లిస్టులో చోటు దక్కించుకున్నాయి.

pushpa
పుష్ప
author img

By

Published : Jan 4, 2022, 2:12 PM IST

Pushpa songs record: ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ నటించిన 'పుష్ప' సినిమా గత నెలలో విడుదలై ఘన విజయం సాధించింది. బన్నీ గెటప్​, నటన సినిమాకు హైలైట్​గా నిలిచాయి. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా బాగా ప్రేక్షకదారణ పొందాయి. యూట్యూబ్​లో మిలియన్ల వ్యూస్​ను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలోని అన్ని పాటలు యూట్యూబ్​ విడుదల చేసిన టాప్​-100 గ్లోబల్​ సాంగ్స్​ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

తొలి రెండు స్థానాల్లో 'ఊ అంటావా', 'సామీ సామీ' సాంగ్స్​ ఉండగా.. శ్రీవల్లి(24), దాక్కో దాక్కో మేక(74), ఏయ్​ బిడ్డా ఇది నా అడ్డా(97)లో నిలిచాయి.

'పుష్ప' విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్​ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్​లో ఈ చిత్రం హవా ఇంకా కొనసాగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. పుష్పరాజ్​గా బన్నీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. త్వరలోనే పార్ట్​2ను (పుష్ప: ది రూల్) తెరకెక్కించనున్నారు సుకుమార్. ఎర్ర చందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో రూపొందందీ మూవీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అలాంటి పాత్రలో అస్సలు చేయను.. బాలీవుడ్​ ఎంట్రీపై బన్నీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.