సుకుమార్(pushpa rashmika look) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న రష్మిక లుక్‌ను సెప్టెంబరు 29 ఉదయం 9.45గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. బన్నీ భార్య పాత్రలో నటిస్తుంది రష్మిక. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని సన్నివేశాలు, 'దాక్కో దాక్కో మేక' పాట చిత్రంపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి భాగం క్రిస్మస్ కానుకగా(Pushpa movie release date) ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది. కానీ, ఆ పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది.
రవితేజ చేతుల మీదగా
రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'పెళ్లి సందD'(pelli sandadi new movie). ఈ చిత్రంలోని 'మధుర నగరిలో' పాటను సెప్టెంబరు 29 ఉదయం 11గంటలకు హీరో రవితేజ విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. దర్శకుడు కె.రాఘవేంద్రరావు(pelli sandadi 2021 trailer).. ఈ మూవీతోనే నటుడిగా పరిచయమవుతున్నారు. గౌరి రోనంకి దర్శకురాలు.
'నల్లమల' సినిమా టీజర్
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'నల్లమల'. అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర టీజర్ సెప్టెంబరు 30 ఉదయం 11గంటలకు విడుదల కానుంది. రవిచరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఎమ్. నిర్మాత.
ఫస్ట్ గ్లింప్స్
రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్, వాణీకపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'షంషేరా'(shamshera movie story). పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని కరణ్ మల్హోత్రా తెరకెక్కించారు. నేడు(సెప్టెంబరు 28) రణ్‌బీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని(shamshera movie release date) ఆయన లుక్కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 2021 మార్చి 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ట్రైలర్
హీరో పృథ్వీ రాజ్ నటించిన కొత్త సినిమా 'అంధాదున్' మలయాళ రీమేక్ 'భ్రమమ్'(andhadhun malayalam remake). ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 7నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. రవి కె చంద్రన్ దర్శకుడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'పుష్పకవిమానం' రిలీజ్ డేట్.. 'ఒరేయ్ బామ్మర్ది' ట్రైలర్