ETV Bharat / sitara

'పుష్ప' సాంగ్ ప్రోమో.. నయన్ 'నేత్రికన్' రిలీజ్​కు రెడీ ​ - నెట్రికన్

కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పుష్ప, నేత్రికన్, దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా, క్రేజీ అంకుల్స్, 18 పేజెస్​ చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

new movie updates
సినిమా కబుర్లు
author img

By

Published : Aug 11, 2021, 10:02 PM IST

దాదాపు రెండేళ్ల తర్వాత బాలీవుడ్​లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు మలయాళ హీరో దుల్కర్​ సల్మాన్​. దర్శకుడు ఆర్​.బాల్కీ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లర్​ సినిమాలో దుల్కర్​ నటించనున్నారు. దుల్కర్​తోపాటు సన్నీ డియోల్, పూజాభట్​, శ్రేయ ధన్వంతరి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2022కి ముందే విడుదల చేయనున్నారు.

దాక్కో దాక్కో మేక..

అల్లు అర్జున్‌ నటిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తీస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో 'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే పాట 11 సెకండ్ల ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్టు 13న మొత్తం పాట ఐదు భాషల్లో రిలీజ్‌ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'నేత్రికన్' రెడీ

స్టార్‌ కథానాయిక నయనతార ప్రధానపాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'నేత్రికన్'. మిలింద్‌ రావు దర్శకత్వం వహించారు. ఆగస్టు 13న డిస్నీఫ్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదల కానుంది. అందమైన అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేసి.. చిత్రహింసలు పెట్టి వాళ్ల చావును కళ్లారా చూసి ఆనందించే ఓ సైకో పాత్రలో అజ్మల్‌ నటించారు. పోలీసులకు చిక్కకుండా తిరిగే ఈ సైకో కథకు ఓ అంధురాలు ఎలా ఫుల్‌స్టాఫ్‌ పెట్టింది అనేది నెట్రికన్ కథ.

netrikan
నెట్రికన్​

క్రేజీ అంకుల్స్​..

ప్రముఖ వ్యాఖ్యాత శ్రీముఖి, నేపథ్య గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'క్రేజీ అంకుల్స్'. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 19న థియేటర్​లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

crazy uncles
క్రేజీ అంకుల్స్​

డబ్బింగ్​ షురూ..

యువ నటుడు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం '18 పేజెస్'. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ ప్రారంభమైంది.

ఇదీ చదవండి: 'పాగల్' బ్రేకప్ సాంగ్​.. 'పెళ్లి సందD' టైటిల్ గీతం రెడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.