Pushpa movie sukumar: నీటిలో పడిపోయిన తనకు చేయిచ్చి అల్లు అర్జున్ పైకి లాగాడాని దర్శకుడు సుకుమార్ చెప్పారు. 'ఆర్య' సినిమాతో తనకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడంపై సుక్కు ఇలా స్పందించారు. అలానే బన్నీతో ఏడు సినిమాలు చేస్తానని అప్పట్లోనే అతడికి మాటిచ్చినట్లు సుకుమార్ అన్నారు. 'పుష్ప' రిలీజ్ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
Pushpa story: ఒకానొక దశలో ఈ సినిమా పాన్ ఇండియా తీయగలమా లేదా అని భయపడి వదిలేశామని సుకుమార్ చెప్పారు. కానీ ఎలా తెలిసిందో ఏమో గానీ రాజమౌళి తమకు ఫోన్ చేసి కన్విన్స్ చేశారని అన్నారు. దాంతో 'పుష్ప' పాన్ ఇండియా సినిమాగా మారిందని సుక్కు పేర్కొన్నారు. ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు కానీ ఈ సినిమాలో ఫెర్ఫార్మెన్స్ విషయంలో ఓ అద్భుతాన్ని చూస్తారని డైరెక్టర్ సుకుమార్ చెప్పారు. అలానే 1996-2004 మధ్య కాలంలో జరిగే కథతో 'పుష్ప' తీశామని వెల్లడించారు.
ఈ సినిమా గురించి మాట్లాడిన హీరో అల్లు అర్జున్ ఛాలెంజ్ చేశారు. "ఈ మూవీ రిలీజ్ అయ్యాక ప్రతి డైరెక్టర్ సుక్కు దగ్గరికి వచ్చి క్లాసెస్ తీసుకోకపోతే నేను షర్ట్ తీసేసి మైత్రీ ఆఫీస్లో తిరుగుతా" అంటూ చెప్పుకొచ్చారు.
శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన 'పుష్ప' సినిమా.. డిసెంబరు 17న ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. గతంలో బన్నీతో 'ఆర్య', 'ఆర్య2' చిత్రాలు తీసిన సుకుమార్.. 'పుష్ప'కు దర్శకత్వం వహించారు. రష్మిక హీరోయిన్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించాయి.
ఇవీ చదవండి:
- బాలీవుడ్లో చాలా ఆఫర్స్ వచ్చాయి.. కానీ: అల్లు అర్జున్
- 'పుష్ప' సినిమా.. ఈ విషయాలు గమనించారా?
- భుజం ఎత్తడం వల్ల నాకు ఆ సమస్య వచ్చింది: అల్లు అర్జున్
- 'పుష్ప' కాదు మన సినిమా గెలవాలి: అల్లు అర్జున్
- Allu Arjun: రోడ్డు పక్కన హోటల్లో అల్లు అర్జున్..
- చిన్నారి కలను నిజం చేసిన అల్లు అర్జున్
- బాలీవుడ్ కాదు.. నా టార్గెట్ అదే: అల్లు అర్జున్
- Pushpa movie: 'పుష్ప' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.250 కోట్లు!