ETV Bharat / sitara

Pushpa movie: 'పుష్ప' మేకింగ్ వీడియో.. - oke oka jeevitham movie sharwanand

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పుష్ప, అఖండ, భళా తందనాన, ఒకే ఒక జీవితం చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

pushpa making video
పుష్ప మేకింగ్ వీడియో
author img

By

Published : Dec 26, 2021, 6:51 PM IST

Pushpa making video: అల్లు అర్జున్ 'పుష్ప'.. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి వారం పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.229 కోట్ల గ్రాస్​ వసూలు చేసింది. మరిన్ని వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే 'పుష్ప' మేకింగ్​ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ వీడియోలోని ప్రతి ఫ్రేమ్​ ఆకట్టుకుంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన 'పుష్ప' సినిమాలో అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

Akhanda movie: నందమూరి బాలకృష్ణ 'అఖండ'.. థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు డిస్ట్రిబ్యూటర్స్ హాజరయ్యారు.

akhanda 25 days celebration
'అఖండ' 25 డేస్ సెలబ్రేషన్స్

మాస్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్​లో కనిపించారు. అఘోరాగా విశ్వరూపం చూపించి, అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ ఈ చిత్రానికే హైలెట్​గా నిలిచింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మాత.

balayya akhanda movie
బాలయ్య అఖండ మూవీ

Naveen polishetty: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా తన కొత్త మూవీ టీమ్ విషెస్ చెప్పింది. త్వరలోనే టైటిల్​ వెల్లడిస్తామని తెలిపింది. అలానే ఆసనంలో పంచె కట్టి, రెండు చేతులకూ ఉంగరాలతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.

naveen polishetty
నవీన్ పోలిశెట్టి

ఈ సినిమాను సితార ఎంటర్​టైన్​మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ప్రకటించే అవకాశముంది.

శ్రీవిష్ణు 'భళా తందనాన' పోస్ట్ ప్రొడక్షన్ మొదలైంది. తొలుత డబ్బింగ్​ను ప్రారంభించారు. ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్. చైతన్య దంతులూరి డైరెక్టర్. అలానే శర్వానంద్ 'ఒకే ఒకే జీవితం' టీజర్ అప్డేట్.. సోమవారం వెల్లడించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. ఇందులో అమల కీలకపాత్ర పోషిస్తున్నారు. శ్రీకార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

bhala thandanana movie
భళా తందనాన' మూవీ టీమ్
oke oka jeevitham movie sharwanand
శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.