ETV Bharat / sitara

పూరి పాన్ ఇండియా కథ సల్మాన్ కోసమా! - salman khan pyri jagannath new movie

లాక్​డౌన్ సమయంలో కొత్త స్క్రిప్టు తయారు చేసుకునే పనిలో పడ్డారు దర్శకులు. పూరి జగన్నాథ్ ఇప్పటికే రెండు కథలు సిద్ధం చేసుకున్నారట. ఇందులో ఒకటి పాన్ ఇండియా సినిమా. అయితే ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా చేయనున్నారని టాక్.

పూరి
పూరి
author img

By

Published : May 25, 2020, 5:32 AM IST

తన సినిమాలను ఎంత వేగంగా పూర్తి చేయగలరో.. అంతకంటే వేగంగా తన కథల్నీ సిద్ధం చేసుకోగలరు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఇప్పుడీ స్పీడ్‌తోనే ఈ లాక్‌డౌన్‌ విరామంలో రెండు స్క్రిప్టులు పూర్తి చేశారు పూరి. వీటిలో ఒకటి పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న చిత్రమని ఇప్పటికే ప్రకటించారు కూడా. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

పూరి సిద్ధం చేసుకున్న ఈ పాన్‌ ఇండియా కథ.. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కోసమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు విషయమై ఆయనతో సంప్రదింపుల ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆయనకు నిర్మాత కరణ్‌ జోహర్‌ సహాయ సహకారాలు అందిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం వీళ్లిద్దరి కలయికలోనే 'ఫైటర్‌' ముస్తాబవుతోంది. విజయ్‌ దేవరకొండ - అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇప్పటికే 40శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఈ కొత్త పాన్‌ ఇండియా చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంటుంది. మరి నిజంగా ఈ కథ సల్మాన్‌ కోసమేనా? లేక మరో బాలీవుడ్‌ హీరోతో తెరకెక్కిస్తారా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.