ETV Bharat / sitara

Puri Jagannadh Birthday: మాస్​ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​.. పూరీ జగన్నాథ్

మాస్​ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు(Puri Jagannadh Birthday) నేడు(సెప్టెంబరు 28). ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణంపై ప్రత్యేక కథనం.

Puri Jagannadh Celebrating His 56 Birthday
Puri Jagannadh Birthday: మాస్​ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​.. పూరీ జగన్నాథ్
author img

By

Published : Sep 28, 2021, 10:17 AM IST

ఎవరు సినిమా తీస్తే ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందో.. ఆయనే పూరీ జగన్నాథ్‌. సినిమాను విభిన్న శైలిలో తీస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడీ డైరక్టర్. మాస్ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచిన పూరీ.. నేడు 56వ వసంతంలోకి(Puri Jagannadh Birthday) అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన సినీకెరీర్​పై ప్రత్యేక కథనం.

తిట్లే అతడి సినిమా టైటిల్స్..!

'పోకిరి', 'ఇడియట్', 'దేశముదురు' ఇలాంటి వాటిని టైటిల్స్​గా పెట్టాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. కానీ పూరీ మాత్రం వీటినే టైటిల్స్​గా పెట్టి హిట్​లు కొట్టాడు. ఇంటి పేరు పూరీ కాదు..! ఈ దర్శకుడు ఇంటి పేరు పెట్ల. కానీ పూరీ జగన్నాథ్​ గానే అందరికీ సుపరిచితం. పూరీ జగన్నాథుడు ఆరాధ్య దైవం కావడం వల్లే ఆ పేరు పెట్టుకున్నాడు.

ఆర్జీవీ అసిస్టెంట్​గా ఇండస్ట్రీలోకి

ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ సహాయకుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు పూరీ. తెలుగులో పలు చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు కన్నడలోనూ పనిచేశాడు. పునీత్ రాజ్​కుమార్​ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరీనే కావడం విశేషం. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌తోనూ పనిచేసిన ఘనత ఈ డైరెక్టర్‌ సొంతం.

పవన్‌తో సినీ కెరీర్‌ ప్రారంభం

తన కెరీర్​ను పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ 'బద్రి'తో ఆరంభించిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత 'బాచి', 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్‌', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', 'శివమణి', 'ఆంధ్రావాలా', 'పోకిరి', 'బుజ్జిగాడు', 'దేశముదురు', 'నేనింతే', 'గోలీమార్‌', 'బిజినెస్‌మేన్‌', 'ఇద్దరమ్మాయిలతో', 'హార్ట్‌ ఎటాక్‌', 'టెంపర్', 'మెహబూబా', 'ఇస్మార్ట్​ శంకర్'​ వంటి సినిమాలతో గుర్తింపు పొందాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రానికి ఉత్తమ సంభాషణ రచయితగా నంది అవార్డు గెలుచుకున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. 'పోకిరి' సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్‌ అవార్డు, సంతోషం అవార్డు అందుకున్నాడు. 'నేనింతే' సినిమాకు ఉత్తమ సంభాషణ రచయితగా మరో నంది పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'లైగర్​' సినిమాను రూపొందిస్తున్నాడు పూరీ జగన్నాథ్​. ఇందులో దిగ్గజ బాక్సర్​ మైక్​ టైసన్​ నటించనున్నాడంటూ ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. ఇప్పడా వార్తనే నిజం చేస్తూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అతడు తొలిసారి భారతీయ​ చిత్రంలో మెరవనున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్​. పాన్‌ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.

ఇదీ చూడండి.. Ram Charan Movies: 14 ఏళ్ల నట ప్రస్థానం.. వెల్లివిరిసిన అభిమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.